ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల వరదలు పోటెత్తడంతో కొందరు వ్యక్తులు మరణించారు. ఈ తరుణంలో వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే రూ. 5 లక్షల పరిహారం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే పంట నష్టం అంచనాలను అక్టోబర్‌ 31వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, కోవిడ్‌, వార్డు సచివాలయాల తనిఖీలు, నాడు- నేడు తదితర అంశాలపై మంగళవారం సీఎం జగన్ కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్‌ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కలెక్టర్లు మానవతా ధృక్పథంతో పనిచేస్తూ.. కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వారికి సహాయం అందించాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అక్టోబర్‌ 31వ తేదీలోపు పంట నష్టానికి సంబంధించిన అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు కూడా 31లోపే పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కరెంట్‌ పునరుద్ధరణను వేగంగా చేపట్టినందుకు కలెక్టర్లను సీఎం జగన్‌ అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: