కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్  పద్ధతినే చాల మంది అనుసరిస్తున్నారు.  మరి కొంత కాలం పాటూ ఇదే కొనసాగొచ్చు అని కొన్ని కంపెనీలు అంటున్నాయి. మరి అంత కష్టమైన పనిని యిట్టె చేసేయాలంటే ఈ పద్ధతులని అనుసరించండి. అప్పుడు పని మరెంత సులువుగా అయిపోతుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే... ప్రకటనలు అనేక మార్లు ఇబ్బంది పెడతాయి. అలాంటప్పుడు  ప్రకటనలు రాకుండా చేయాలంటే?  క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ని ప్రయత్నించండి. ఇలా పేరు యాడ్‌బ్లాక్‌ ప్లస్‌. వెబ్‌సైట్‌లు, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ లాంటి వాటిపై  వచ్చే అనవసరపు ప్రకటనలు తొలగించి మీ పనులను మీరు చేసుకోవచ్చు.

అలానే పని ఎక్కువగా ఉంటె తప్పులని చూడడం కష్టం అయిపోతుంది. అలాంటప్పుడు  ఈ ఎక్స్‌టెన్షన్‌కి ఆ పని అప్పజెప్పండి. పేరు గ్రామర్లీ. ఇది మీ రాతలోని అక్షర దోషాలు, ఇతర వ్యాకరణ దోషాలను ఇది  పసిగడుతుంది. సులువుగా  దానికదే సరిదిద్దుతుంది. దీంతో మీ పనిని మరింత త్వరగా పూర్తి చేసేయొచ్చు. కాబట్టి దీనిని ఉపయోగించండి. అలానే కొన్ని సార్లు వినోద, ఇతర వెబ్‌సైట్‌ల నుంచి నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి  రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఈ ఎక్స్‌టెన్షన్‌ని ప్రయత్నించండి.

ఇది ఇలా ఉండగా ఎన్నో ఎకౌంట్‌లు, వెబ్‌సైట్‌లలో లాగిన్‌ అవుతుంటాం. వీటి పాస్‌వర్డ్‌ ఒక్కోసారి మరచిపోతాం. అదే  ఓ ఎక్స్‌టెన్షన్‌ ఉంటే? మీ పాస్‌వర్డ్‌లు, అడ్రస్‌లు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌ నంబర్లు, పాస్‌పోర్ట్‌, ఇన్సురెన్స్‌ కార్డ్‌ తదితర ముఖ్య సమాచారాన్ని భద్రపరుస్తుంది. అలానే 'గూగుల్‌ కీప్'. తో  మీ ఫొటోలు, యూఆర్‌ఎల్‌ లింక్‌లు, టెక్స్ట్‌, కోట్‌, వెబ్‌పేజీ.. తదితర సమాచారాన్నంతటినీ ఒక్క క్లిక్‌తో పదిలపరచొచ్చు. అవసరమైనపుడు తిరిగి ఉపయోగించుకోవచ్చు. మీ రోజు వారీ ముఖ్యమైన పనులనూ నోట్స్‌ రూపంలో రాసుకోవచ్చు. ఏదో నచ్చిన పోస్ట్‌, మెచ్చిన కథనం లాంటివి ఉంటే అది సేవ్‌ టు పాకెట్ చెయ్యొచ్చు‌. ఈ ఎక్స్‌టెన్షన్ని క్రోమ్‌కి కలిపితే చాలు... చూసారా ఎన్నో వీటి ద్వారా చేసేయొచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: