దుబ్బాక ఉప ఎన్నికలను బిజెపి చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి నేతలు అందరూ పాల్గొంటున్నారు. దౌల్తాబాద్ మండలం పలు గ్రామాల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. దుబ్బాక లో ఒక యుద్ధం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక లో రఘునందన్ రావు గెలిపియ్యాలి అని ఆయన కోరారు. ఇప్పుడు అసెంబ్లీ లో నేను ఒక్కన్నే ఉన్న, రఘునందన్ అన్న నాతో పంపిస్తే ఈ ధర్మ ద్రోహులను బట్టలు లేకుండా తిప్పి తిప్పి కోడతారు అని ఆయన  పేర్కొన్నారు.

దుబ్బాక డెవలప్ మెంట్ రఘునందన్ అన్న తోనే సాధ్యం అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. హరీష్ రావు రెండు కళ్లు అని చెప్తున్నారు అని, ఇన్ని రోజుల నుంచి ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. సిద్దిపేటలో అభివృద్ధి జరిగిందని అన్నారు. హరీష్ నికు దమ్ముంటే  దుబ్బాక లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ కట్టించినవ్, ఎన్ని ప్రజలకు ఇచ్చినవ్ లిస్ట్ తిసుకరా.. ఇచ్చిన ఇళ్లు కూడా నీ కార్యకర్తల కే ఇచ్చినవ్ ఎక్కడైనా పెద ప్రజలకు ఇచ్చినవా అని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తలు కష్టపడి రఘునందన్ రావు గెలిపిస్తే దుబ్బాక అభివృద్ధి జరుగుతుంది అని చెప్పుకొచ్చారు.

ఆయన నా వెంట ఉంటే యావత్ తెలంగాణ లోనే జెండా ఎగిరేస్తామని అన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ కార్పోరేటర్లతో అధికారులు కుమ్మకు అయ్యారని రాజసింగ్ ఆరోపించారు. అసలైన పేదలకు వరద సాయం అందటం లేదు అని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, ఓటర్లకు మాత్రమే పది వేలు అందుతున్నాయి అని చెప్పుకొచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం వరద సాయం చేస్తోంది అని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో వరద సాయం ప్రభుత్వానికి శాపంగా మారబోతోందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: