గ్రేటర్ ఎన్నికల కోలాహలం మొదలైంది అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకత్వ లోపం వల్ల ,నాయకులను తయారు చేసుకోలేక, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కాళ్ళ మీద పడుతున్నారు బీజేపీ లో చేరాలని... అంటూ ఆయన విమర్శించారు. జనసేన తో పొత్తు లేదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తే , కిషన్ రెడ్డి, లక్ష్మణ్ బండి సంజయ్ కి సమాచారం లేకుండానే పవన్ కళ్యాణ్ మద్దతు ఆడిగారా...? అని ఆయన నిలదీశారు. మత ప్రాధిపధికాన ,అభివృద్ధి ఆ ,ప్రశ్నించే గొంతుకన అని కాంగ్రెస్ భావిస్తుంది అన్నారు.

కేసీఆర్ మీద చార్జిషీట్ రిలీజ్ చేస్తున్నామని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వచ్చారని... నేను ప్రకాష్ జవదేకర్ మీద చార్జిషీట్ విడుదల చేస్తున్న దీనిమీద సమాధానం చెప్పిన తరువాత నే ప్రకాష్ జవదేకర్ ఢిల్లీ వెళ్ళాలి అని ఆయన డిమాండ్ చేసారు. 1.మై హోమ్ అక్రమ సిమెంట్ వ్యాపారం చేస్తుంది..పర్యావరణ అనుమతులు ,అటవీ అనుమతులు లేవని వేల కోట్లు నష్టపోతున్నామని నాతో పాటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేసారు... దానిమీద చర్యలు తీసుకోవాల్సిన ప్రకాష్ జవదేకర్ మై హోమ్ రామేశ్వర్ రావు కి అండగా ఉన్నారు అని ఆయన మండిపడ్డారు.

మీ పార్లమెంట్ సభ్యుడు ఆధారాలతో చేసిన పిర్యాదు పై ఎందుకు చర్యలు తీసుకోలేదు...? అని నిలదీశారు. 2.శ్రీశైలం ,కల్వకుర్తి ప్రాజెక్టుల అక్రమార్కుల పై ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని ప్రశ్నించారు. 3.మూసి నది ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని నాతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిర్యాదు చేసాం అన్నారు. పిర్యాదు పై చర్యలు తీసుకుంటే ఇవాళ ఇంత వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడకపోతుండే దీనికి కారణం కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అని ఆయన విమర్శించారు. 4.హైదరాబాద్ చెత్త జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల అక్కడ ఉన్న 30 గ్రామాలు పూర్తిగా కాలుష్యం అవుతున్నాయని ఎన్జీటీ కి వెళ్ళా అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేస్తే మంత్రి కేటీఆర్ కి సన్నిహితులు అక్రమంగా దోచేసారని ప్రకాష్ జవదేకర్ కి పిర్యాదు చేసా అయిన చర్యలు తీసుకోలేదు అని విమర్శించారు. 5.హుస్సేన్ సాగర్  పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు తీర్పు ఉందని అక్కడ సెక్రటేరియట్ వద్దని ప్రకాష్ జవదేకర్ కి పిర్యాదు చేశా అన్నారు. 6.111 జీవో గండిపేట చెరువు పరిసరాల్లో ఎలాంటి నిర్మాణాలు చెపట్టవద్దు... అక్కడ కేటీఆర్ 25 ఎకరాల అక్రమ ఫార్మ్ హౌజ్ ,రమేశ్వర్ రావు 30 ఎకరాల్లో 30 అంతస్థుల 3వేల అక్రమ నిర్మాణం చేపట్టారు అని మండిపడ్డారు. ఈ అక్రమ నిర్మాణాలపై ప్రకాష్ జవదేకర్ కి పిర్యాదు చేసాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: