క‌రోనా టెస్టుల్లో ఏపీ ప్ర‌భుత్వం రికార్డు సృష్టించింది.  ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చేపడుతూ క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేపట్టింది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల్లో అప్ర‌మ‌త్త‌త‌, చైత‌న్యం పెరిగాయి. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. క‌రోనా విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరుపై అంత‌ర్జాతీయ మీడియా సైతం ప్ర‌శంస‌లు కురిపించడం విశేషం. తాజాగా గడిచిన 24 గంటల్లో 54,710 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 620 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,67,683కి చేరింది. కొత్తగా వైరస్ బారినపడి ఏడుగు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,988కు పెరిగింది. తాజాగా 3,787 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, మొత్తం రికవరీ కేసుల సంఖ్య 8,52,298కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 8,397గా ఉన్నాయి. కాగా ప్రభుత్వం మొదటినుంచి రాష్ట్రంలో కరోనా టెస్టులు పెద్ద సంఖ్యలో నిర్వహిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా టెస్ట్‌ల సంఖ్య లక్షల్లోనే ఉండగా… తాజా టెస్టులతో కలిపి ఏపీలో టెస్టుల సంఖ్య కోటి దాటేసింది.


ఆదివారం విడుదల చేసిన కరోనా బులిటెన్ వివరాల ప్రకారం… రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,00,17,126 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. వీలైనన్ని చోట్ల కరోనా వైద్య పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్‌ కేసులు గుర్తిస్తే వెంటనే వారికి క్వారంటైన్‌ లేదా ఐసొలేషన్‌ చేయడం, అవసరమైతే ఆస్పత్రుల్లో చికిత్స చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా వ్యవహరిస్తోంది. అందుకే తక్కువ వ్యవధిలోనే కోటి వైద్య పరీక్షల మైలు రాయిని దాటింది. రాష్ట్రంలో తొలుత కరోనా పరీక్షలకు అనువైన ల్యాబ్స్‌ లేకపోవడం వల్ల, ఫిబ్రవరి 1న తొలి శాంపిల్‌ను తెలంగాణలోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత రాష్ట్రంలో తొలి కరోనా పరీక్ష మార్చి 7న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌)లో నిర్వహించారు.


దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.. కానీ, టెస్ట్‌ల సంఖ్యను భారీగానే ఉంటుంది... ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచి కరోనా టెస్టులు పెద్ద సంఖ్యలో నిర్వహిస్తోంది ప్రభుత్వం... కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా టెస్ట్ ల సంఖ్య లక్షల్లోనే ఉండగా... ఏపీలో మాత్రం ఇవాళ వాటి సంఖ్య కోటి దాటేసింది... ఇవాళ ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 54,710 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 620 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: