జగన్ అధికార పీఠం ఎక్కగానే ఒకేసారి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కని వారికి రెండున్నర ఏళ్లలో మళ్ళీ ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారు. పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి వేరే వారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటింది. అంటే మరో ఏడాదిలో జగన్ మంత్రివర్గ విస్తరణ చేయడం ఖాయం. అయితే ఈ కేబినెట్ విస్తరణలో అవకాశం దక్కించుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.

ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతుంది. ప్రత్యర్ధి పార్టీ టీడీపీపై దూకుడుగా వెళ్లే రోజాకు మొదట్లోనే మంత్రి పదవి రావాల్సి ఉంది. కానీ సామాజికవర్గాల సమీకరణల్లో భాగంగా ఆమెకు మంత్రి పదవి మిస్ అయింది. అయితే ఈసారి మాత్రం మంత్రి పదవి ఫిక్స్ అని ప్రచారం జరుగుతుంది. రోజా లాంటి వారు కేబినెట్‌లో ఉంటే ప్రతిపక్ష టీడీపీకి స్ట్రాంగ్‌గానే చెక్ పెట్టొచ్చు. ఇక ఇదే క్రమంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం నడుస్తోంది.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజని...త్వరగానే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో కూడా బాగానే పనిచేసుకుంటున్నారు. కేవలం నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా, ఈమె రాష్ట్ర స్థాయిలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అధికార పార్టీలో బాగా యాక్టివ్‌గా ఉండే ఎమ్మెల్యే కూడా రజనినే దీంతో, ఆమెకు మంత్రి పదవి రావొచ్చని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న మహిళా మంత్రులు దూకుడుగా ఉన్నట్లు కనిపించడం లేదు.

ప్రతిపక్ష టీడీపీకి చెక్ పెట్టడంలో మహిళా మంత్రులు కాస్త వెనుకపడ్డారనే చెప్పొచ్చు. పైగా వీరు రాష్ట్ర స్థాయిలో మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకోలేదని విశ్లేషుకులు చెబుతున్నారు. కాబట్టి వీరిని రీప్లేస్ చేసి, రోజా, రజనిలకు మంత్రి పదవులు ఇవ్వొచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: