సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళలేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోకుండా తమకు అనుకూలంగా ఉన్నవారితో మాత్రమే మాట్లాడి చాలా మంది నేతలు ఇళ్లకు వెళ్లే వారు. అంతేకాకుండా నియోజకవర్గాల్లో ఉండకుండా హైదరాబాద్ లో లేకపోతే బెంగళూరులో లేకపోతే చెన్నై లో ఉండే వ్యాపారాలు చేసుకునే నేతలు ఎందరో ఉన్నారు.

దాని కారణంగా పార్టీ చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరుగుతుంది. నియోజకవర్గానికి వెళ్లడం లేదు. పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండని పరిస్థితి నియోజకవర్గంలో ఉంది అనే మాట వాస్తవం. చాలామంది నాయకులు... పార్టీ కోసం కష్టపడే వారికి కూడా ఎమ్మెల్యేల నుంచి నుంచి ప్రోత్సాహం అందడం లేదని అంటున్నారు. పార్టీ కోసం గత పదేళ్ల నుంచి ఖర్చుపెట్టిన చాలామంది నేతలు ఇప్పుడు సంపాదించుకునే పనిలో పడి నియోజకవర్గాలకు కూడా రావడం మానేశారు.

కొంతమంది వ్యక్తులను నియమించుకుని వారి సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్లడం చాలా మందిని విస్మయానికి గురిచేస్తున్న అంశం గానే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి జగన్ చెప్తున్నా సరే కొంతమంది వైఖరిలో మార్పు రాకపోవడంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలో వైసీపీ నేతలు చాలా బలంగా ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇక ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోవడంతో కార్యకర్తలకు కూడా ఏం చెప్పాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నారు. ఓట్ల కోసం చాలామంది నాయకులు ప్రజల్లోకి వచ్చిన సరే ఇప్పుడు ప్రజల్లో కనపడక పోవటంతో వైసిపి కార్యకర్తలు నేతలు కూడా ఇప్పుడు సీఎం జగన్ దృష్టి సారించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: