ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం అన్ని వాహన తయారీ కంపెనీలకు ఎలక్ట్రికల్ వాహనాలు తయారు చేయాలి అంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎన్నో రకాల కంపెనీలు అధునాతన టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాల ను మార్కెట్ లోకి తీసుకు వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇటీవలే మరో కొత్త వాహనం మార్కెట్లోకి వచ్చింది.  ఒకవేళ మీరు కొత్తగా ఆటో కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే మీ కోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.



 దిగ్గజ త్రీ వీలర్ తయారీ కంపెనీ పియాజియో తాజాగా సరికొత్త ఆటోలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇక సరి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఆటోలకు డీజిల్ కొట్టించాల్సిన  అవసరం లేదు ఎందుకంటే ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్. అయితే కంపెనీ వీటిని ఫిక్స్డ్ బ్యాటరీ తో  మార్కెట్లో లాంచ్ చేసింది. ఇక ఈ సరికొత్త వాహనంలో 9.5 కిలోవాట్ పవర్ ట్రైన్ ఉంటుంది. ఫుల్లీ  మెటల్ బాడీ వీటి ప్రత్యేకత. అంతేకాదు ఇక మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త త్రీ వీలర్ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.



 అంతేకాదు పియాజియో ఇటీవలే మార్కెట్లోకి తీసుకు వచ్చిన కొత్త ఆటోలు కొనుగోలు చేసిన వారికి మరిన్ని బెనిఫిట్స్ కూడా లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ ఆటోలపై మూడేళ్లపాటు వారంటీ లభిస్తుంది లేదంటే లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తారు. మూడేళ్ల పాటు ఉచిత మెయింటెనెన్స్ ప్యాకేజీ కూడా లభిస్తుంది. అంతేకాకుండా పియాజియో ఐ కనెక్ట్ యాప్ అందుబాటులో ఉండడంతో రియల్ టైం వెహికల్ డేటా ట్రాకింగ్ సహా ఇతర బెనిఫిట్స్ కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇకపోతే పియాజియో అప్పే ఎలక్ట్రిక్ ఎఫ్ఎక్స్ వెహికల్స్ ధర ఎలా ఉందో తెలుసుకుందాం. ఎక్స్‌ట్రా ఎఫ్ఎక్స్ అనే కార్గో వెర్షన్ కొనుగోలు చేస్తే దీని ధర రూ.3.12 లక్షలుగా ఉంది. అదే ఈసిటీ ఎఫ్ఎక్స్ అనే ప్యాసింజర్ వెహికల్ కొనుగోలు చేస్తే ధర రూ.2.83 లక్షలుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: