ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా కొన్ని విషయాల్లో కాస్త దూకుడుగా ముందుకు వెళుతుందని చెప్పాలి. ఇటీవల ఒక టీవీ డిబేట్ లో జరిగిన వ్యవహారం పై ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పై అమరావతి ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి దాడి చేయడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ఛానల్ అంతు చూస్తామని భారతీయ జనతా పార్టీ హెచ్చరించడంతో సదరు చానల్ కూడా కాస్త అలెర్ట్ అయినట్టుగా తెలుస్తుంది.

ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీ ని టార్గెట్ చేసిన సదరు ఛానల్ మీద బిజెపి కాస్త గట్టిగానే దృష్టి పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇప్పుడు విష్ణు ని కూడా సదరు ఛానల్ టార్గెట్ చేసింది.  ఆయన కొన్ని వ్యవహారాల్లో ఉన్నారు అని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దాని మీద విచారణ చేస్తున్నాయి అనే వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేయడం మొదలు పెట్టినది. దీని ద్వారా ఆయనను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ దాడి తర్వాత భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా సదరు ఛానల్ పై దృష్టి పెట్టారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఒకపక్కన రేవంత్ రెడ్డికి కూడా పరోక్షంగా సహాయ సహకారాలు అందించడం కేంద్రంలో భారతీయ జనతా పార్టీని విమర్శించడం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని విమర్శించడం సదరు చానల్ చేస్తూ వస్తోంది. మరి ఈ వ్యవహారాల్లో ఛానల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. టిడిపి మీద విమర్శలు చేసే విష్ణువర్ధన్ రెడ్డి ని కట్టడి చేసే ప్రయత్నాన్ని సదరు చానల్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: