దేశంలో ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది బిజెపి నేతలు వెళ్లవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అలాగే తెలంగాణలో కూడా అలాంటి అవకాశాలు కనబడుతున్నాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న కొంతమంది బిజెపి నేతలు ఆ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బిజెపి నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి తో కూడా చర్చలు జరుపుతున్నారని త్వరలోనే రేవంత్ రెడ్డి తో కూడా సమావేశమై పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం.

దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూడా మాట్లాడాలి అని సదరు నేతలు వారిని కోరారు. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు బీజేపీ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పెద్దగా కనబడటం లేదు. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చే నేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఆశలు పెట్టుకుంది అని అంటున్నారు.

ప్రధానంగా బలమైన నేతలు వస్తే వాళ్ళకి పదవులు కూడా ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నేతలతో బీజేపీ నేతలు చర్చలు కూడా జరుపుతున్నారని సమాచారం. అలాగే అదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కొంతమంది బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అని టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: