కరోనా సెకండ్ వేవ్ జోరుగా సాగుతోంది. గతేడాది కరోనా కంటే కొత్త కరోనా మరింత ఎఫెక్టివ్‌గా ఉంటోంది. దాని లక్షణాలు కూడా మారాయి. అవి తెలుసుకోకపోతే.. ఇబ్బందుల్లో పడతారు. సాధారణంగా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన తరువాత మూడు నుండి ఏడు రోజుల్లో లక్షణాలు కనబడతాయి. లక్షణాలు ఏంటో అందరికీ తెలుసు. కాకపోతే రెండో వేవ్ లో కండరాల నొప్పి కీళ్ళ నొప్పులు తలనొప్పి కడుపునొప్పి వాంతులు విరేచనాలు వంటివి కూడా ఉన్నాయి.


ఒక ఇంట్లో రెండుమూడు రోజుల వ్యవధిలోపలే ఒకరికంటే ఎక్కువ మందికి జ్వరాలు వచ్చాయంటే అది తప్పనిసరిగా కరోనానే ఐవుంటుంది. ఆర్టీపీసీఆర్  టెస్ట్ ని లక్షణాలు వచ్చిన ఐదు రోజుల లోపు చేసుకునే ప్రయత్నం చేస్తే ఫాల్స్ నెగెటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం తగ్గుతుంది. టెస్టు రిజల్టు కాపీ పేషంట్ దగ్గర ఉండటం చాలా అవసరం. ఆసుపత్రులలో అడ్మిషన్ అవసరమైతే ఇది పనికి వస్తుంది. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వచ్చినా లక్షణాలు ఉంటే ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మందికి ఉంటే అది కరోనాగానే గుర్తించాలి.


కరోనా వచ్చిందని టెస్టు ద్వారా తెలుసుకుని డాక్టర్ల దగ్గరికి పోయేకంటే లక్షణాలు కనబడగానే డాక్టర్ల సంరక్షణలోకి పోవడం ముఖ్యం. ఆన్లైన్ కన్సల్టేషన్ లేదా వ్యక్తిగతంగా డాక్టర్ ని కలవడం ముఖ్యం. అలాగే ఇప్పటి వరకు జ్వరం, కీళ్ల నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం లాంటివి కోవిడ్ లక్షణాలు కాగా.. తాజాగా మరిన్ని బయటపడ్డాయి. తలనొప్పి, తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షిస్తే కరోనా పాజిటివ్‌ ఎక్కువగా వస్తోందని గుర్తించారు. కనుగుడ్డు నుంచి కూడా వైరస్‌ శరీరంలోనికి చేరుతోందని, వారిలో కళ్లు ఎర్రబడుతున్నట్టుగా చెబుతున్నారు. ఇవే కాకుండా కీళ్లనొప్పులు, మైయాల్జియా, జీర్ణసంబంధ సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కూడా కొత్తగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కళ్లు ఎర్రబడడం అనేది ఎక్కువగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: