కరోనా సెకండ్ వేవ్ కోరలు చాచూతుంది.. ఊహకు అందని విధంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. విషయమేంటంటే... గతంలో వచ్చిన కరోనా వస్తే కనీసం కొద్ది రోజులు అన్నా బ్రతికేవాల్లు.. కానీ ఇప్పుడు ప్రబలుతున్న వైరస్ మాత్రం చావును కోరుతుంది. కరోనా పాజిటివ్ వస్తే ఇక వారు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే.. ఇకపోతే ఈ విషయం పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. తాజాగా కరోనా విజృంభణ పై రాష్ట్ర సీఎం లతో చర్చలు జరపనున్నారు.


దేశవ్యాప్తంగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాని కట్టడి చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కేసులు పెరుగుదలతో ఉన్న వైద్య సేవలు చాలడం లేదు. దీంతో చాలా మంది ప్రాణాలను విడుస్తున్నారని ప్రజలు కేంద్రం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..


ఈ నేపథ్యంలోనే ఉన్న అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని శుక్రవారం కేవలం కరోనా సెకండ్‌ వేవ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించనున్నారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ లభ్యత కొరత ఉండడంతో పారిశ్రామికవేత్తలతో చర్చలు చేయనున్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచడంతో పాటు సరఫరా చేసేందుకు వ్యాపారవేత్తలతో చర్చించనున్నారు.. 9 గంటల లోపు కరోనా తీవ్రత పై సమీక్షించనున్నారు.ఉదయం 10 గంటలకు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే సంస్థలతో సమావేశం కానున్నారు. వీటి కోసం ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకున్నారు. కరోనా పరిస్థితిన సమీక్షించడానికి బెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు స్వయంగా మోదీ నే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: