తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈటల టాపికే హాట్ టాపిక్ గా మారింది. ఈటల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు..కొత్త పార్టీ పెడతారా.? ఇతర పార్టీల్లో చేరతారా.? ఒకవేళ పార్టీ పెడితే ఆయనతో కలిసి నడిచేదెవరు.? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈటల తో కలిసి నడవడానికి చాలా మంది నేతలే ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ సంత్రుప్త నేత‌లే ఈట‌ల‌ను క‌లిసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ లో కలిసి పనిచేసి భయటకు వచ్చిన మాజీ ఎంపీ కొండా విష్వేశ్వర్ రెడ్డి ఈటెల నివాసంలో ఆయనను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ లో ప‌నిచేసిన‌వారికి అన్యాయం జ‌రుగుతుంద‌ని విశ్వేష్వ‌ర్ రెడ్డి అభిప్రాయం వ్య‌క్తం చేశారు. 

ఇక తాజాగా టిఆర్ఎస్ ఉద్యమం నుండి కలిసి పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటలను కలిశారు. ఈటల ను కలిశారా అని ఆయన్ను మీడియా ప్రశ్నించగా...అందులో తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్న వేశారు. రవీందర్ రెడ్డి సమాధానంతో ఈటెల పార్టీ పెడితే ఆయన కూడా కలిసి నడిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నుండి గెలిచి టిఆర్ఎస్ లో చేరారు. అయితే ముందు నుండి రవీందర్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తక్కువగానే ఉందని కార్యకర్తలు... ఆయన అనుచరులు అసంతృప్తి గా ఉన్నారు. కాబట్టి ఈటెల పార్టీ పెడితే రవీందర్ రెడ్డి కచ్చితంగా కలిసి నడిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పార్టీలో ఈటెల తో కలిసి పనిచేసిన పలువురు నేతలు కూడా ఆయన్ని మందలించాలని అనుకుంటున్నారట. కానీ ఈటెల నే క్లోజ్ చేసిన బాస్ తమను వదిలిపెడతారా అని కామ్ గా ఉంటున్నారట. ఇక ఎన్నిక‌ల నాటికి ఎంత‌మంది నేత‌లు ఈటెల చెంత‌కు చేర‌తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: