కొవిడ్ ఉధృతికి దేశం మొత్తం అల్ల‌క‌ల్లోల‌మైంది. గ‌తేడాది మార్చి చివ‌రివారంలోనే కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో మొద‌టిద‌శ‌ను సాధ్య‌మైనంత‌వ‌ర‌కు క‌ట్ట‌డి చేయ‌గ‌లిగింది. ప్ర‌పంచ దేశాలంద‌రిచేత శ‌భాష్ అనిపించుకుంది. కానీ ఈసారి కుంభమేళాతోపాటు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల మాయ‌లో ప‌డిన కేంద్రం మ‌హ‌మ్మారిని విస్మ‌రించింది. ఫ‌లితం ప్ర‌పంచంలో ఏ దేశంలో లేని విల‌య‌తాండం మ‌న‌ద‌గ్గ‌ర కొన‌సాగింది. ప్ర‌జ‌లంద‌రూ చిగురుటాకులా వ‌ణికిపోయారు. దేశ‌వ్యాప్తంగా వేధిస్తోన్న ఆక్సిజ‌న్ కొర‌త‌, ఔష‌ధాల కొర‌త‌, ఆసుప‌త్రుల్లో బెడ్లు కొర‌త‌, మ‌ర‌ణాలు, క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత వ‌చ్చే ఇత‌ర అనారోగ్యాలు.. త‌దిత‌ర విష‌యాల గురించి పూర్తిగా తెలుసుకున్న భార‌తీయుల‌పై భ‌యం తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ఏమీ లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆ భ‌య‌మే ప్రాణాల‌ను తీసేస్తోంది. ఇప్ప‌టికీ ప్ర‌జ‌లంతా ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని జీవిస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు.

కార్టిజాల్ ఉత్ప‌త్తి అవుతోంది
భ‌యంతో మనిషి శ‌రీరంలలో ఒత్తిడి పెరిగినప్పుడు ‘కార్టిజాల్‌’ అనే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. దీనివ‌ల్ల జీవక్రియలో తేడా వచ్చి ఆకలి మందగించ‌డం, లేదా ఆక‌లి పెర‌గ‌డం, నిద్రలేమి లాంటి కార‌ణాల‌తో అనారోగ్యానికి గుర‌వుతున్నారు. సాధ్య‌మైనంత‌మేర‌కు మాన‌సిక ఒత్తిడిని నివారించుకోవ‌డానికి ధ్యానం చేయ‌డం మంచిది. క‌రోనా సోకిన‌ప్పుడు స్టెరాయిడ్లు ఎక్కువ‌గా వాడ‌టంవ‌ల్ల జుట్టు ఊడిపోవ‌డం, ముఖంపై మొటిమ‌లు రావ‌డం, అవాంఛిత రోమాలు లాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి.   చిన్నచిన్న గడ్డలు ఏర్పడటం, మ‌ధుమేహ రోగుల్లో సెలులైటిస్, మ్యుకొర్మైకోసిస్‌ వంటివి వ‌స్తున్నాయి. కొంత‌మందికి చికెన్‌పాక్స్ కూడా వ‌స్తోంది.

పౌష్టికాహారం, నిద్ర ముఖ్యం
పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు ఎనిమిది గంట‌లు నిద్ర పోవ‌డం, వ్యాయామం చేయ‌డంద్వారా కొవిడ్ నుంచి కోలుకున్న త‌ర్వాత వ‌చ్చే చ‌ర్మ సంబంధిత వ్యాధుల‌కు, మాన‌సిక ఒత్తిడికి దూరంగా ఉండ‌వ‌చ్చు. తాజాపండ్లు, గుడ్లు, పాలు, మొలకెత్తిన గింజలు, తృణ‌ధాన్యాల్లాంటివి తీసుకుంటుండాలి. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండ‌కుండా తొంద‌ర‌గా నిద్ర‌పోవాలి. రోజుకు అరగంట  వ్యాయామం, న‌డ‌క‌, యోగా, ధ్యానం లాంటివి చేయాలి. ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే వైద్యుల‌ను సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: