ఏపీలో జగన్ పరిపాలనా తీరుతో ప్రజలంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైతం హ్యాపీగానే ఉన్నారు. కానీ ప్రతి పక్ష పార్టీ టీడీపీ మాత్రం అధికారాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రజలు వీరిపై చూపించిన విముఖత ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు. భవిష్యత్తులో ఇక టీడీపీ అధికారంలోకి వస్తుందా అన్న అనుమానాలు సైతం అటు తెలుగు తమ్ముళ్లలో మరియు పార్టీ నాయకుల్లో కలుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ పరిస్థితి త్వరలోనే తెలంగాణాలో లాగా దివాళా తీసేలా ఉందని ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే, మునుపటిలా టీడీపీ మళ్ళీ పుంజుకోవాలంటే ప్రజలకు దగ్గరయ్యేలా వారి కోసం పోరాడాలి. మరి అటువంటి వాటికి బాబోరు అండ్ బ్యాచ్ సెట్ అవుతుందా ? ఎప్పుడూ రాజకీయ స్వార్ధాల కోసం పాటుపడే తెలుగు తమ్ముళ్లు ప్రజల కోసం త్యాగాలు చేయగలరా అంటే ఆలోచించాల్సిన విషయమే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

అయితే ఎలాగైనా పార్టీని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పలు మార్లు బాబోరు మరియు చిన్న బాబోరు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అది అంత ఈజీగా జరిగే పని కాదని వారికీ తెలుసు. కానీ దీనికి కొత్త మార్గాలను అన్వేసిస్తున్నట్టున్నారు బాబోరు. మరి ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం, రాబోవు ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి గట్టి రాజకీయ ప్రణాళికను చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే శత్రువులతో అయినా సరే కలిసి తీరక తప్పదు. ఇప్పుడే అదే విధానాన్ని అవలంభించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణాలో ఎలాగయితే తెరాసను దెబ్బ తీయడానికి బాబోరు కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లారో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జగన్ ను ఓడించడానికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్దమవుతున్నట్లు జాతీయ స్థాయిలో వస్తున్న సమాచారం.

అయితే ఇప్పటికే తెలంగాణాలో ఈ పాచిక పారలేదని తెలిసినా మళ్ళీ ఏపీలో ట్రై చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇరు పార్టీలు చర్చించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ? అయితే ఈ ఆలోచన బాబోరిదా లేదా కాంగ్రెస్ దా అన్నది ఇంకా స్పష్టమైన సమాచారం అయితే లేదు. కానీ ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది. ఈ రాజకీయ ఎత్తులను జగన్ ఎలా చేధిస్తాడో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: