దేవినేని ఉమా మహేశ్వరరావు....తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు...కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నేత. గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి, టీడీపీ నేతలు ఎక్కడకక్కడ సైలెంట్ అయిపోయినా సరే పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుడు దేవినేని. నిత్యం అధికార వైసీపీపై విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న దేవినేని ఇప్పుడు జైలు పాలయ్యారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన బామ్మర్ది కొండపల్లి ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని దేవినేని ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు.

తాజాగా మైనింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇదే సమయంలో దేవినేనిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదైంది. కేసు నమోదైన వెంటనే పోలీసులు, దేవినేనీని అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. అయితే దేవినేనీని అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దేవినేనిపై వైసీపీ నేతలు దాడి చేసి, తిరిగి ఆయనపైనే కేసు పెట్టి అరెస్ట్ చేయించారని అంటున్నారు.

మరి ఈ ఘర్షణలో పోలీసులు వైసీపీ నేతలని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఇది అక్రమ అరెస్ట్ అని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. మరి దేవినేని అంశంలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ అంశం ప్రజల్లోకి ఎలా వెళ్లింది? అంటే కాస్త దేవినేనికి అనుకూలంగానే పరిస్తితులు వచ్చాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పైకి ఎలా చెప్పిన దేవినేనిపై వైసీపీ నేతలు దాడి చేసింది నిజమే అని ప్రజలు నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. పైగా రివర్స్‌లో దేవినేనీని అరెస్ట్ చేసి, వైసీపీ ఇంకా ఆయనపై సానుభూతి పెరిగేలా చేసిందని చెబుతున్నారు. దీనికితోడు కృష్ణా జిల్లా టీడీపీ నేతలని ఏకం చేశారు. మామూలుగా కొందరు టీడీపీ నేతలకు దేవినేని అంటే పడదు. అయితే ఇప్పుడు ఈ సంఘటన తర్వాత అంతా ఏకమై, దేవినేనికి సపోర్ట్‌గా నిలబడుతున్నారు. ఏదేమైనా వైసీపీ, దేవినేనికి మేలు చేసినట్లే కనిపిస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: