ఆర్టీసీ ఆదాయాన్ని వ‌దులుకునేందుకు అయినా సిద్ధం కాని అశ్లీల చిత్రాల‌కు మాత్రం నో అంటోంది. అవును ఈ మార్పు స‌జ్జ‌నార్ తెచ్చారు. ఆ విధంగా ఆయ‌న‌ను న‌డిపించిది ఓ సామాన్యుడే. అంతేకాదు ఆర్టీసీ న‌డ‌వ‌డిపై కూడా ఆయ‌న దృష్టి సారించి మార్పు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. కొన్ని వినూత్న పోక‌డ‌ల్లో ప‌నిచేసే స‌జ్జ‌నార్ ఆర్టీసీని లాభాల బాట ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ మార్పు ఎంజీబీఎస్ నుంచి మొద‌లైంది. ఇక్క‌డ ఖాళీగా ఉన్న షాపులు చూసి వెంట‌నే వీటిని అద్దెకు ఇచ్చి సంస్థ‌కు నాలుగు డ‌బ్బులు తీసుకురావాలి అని సూచించారు. అంతేకాదు ప్రాంగ‌ణాల ప‌రిశుభ్ర‌త‌పై కూడా దృష్టి సారించేలా కృషి చేయాల‌ని ఆదేశిం చారు. ప్ర‌భుత్వం న‌డిపే బ‌స్సుల‌కు సంబంధించి ఇంకొన్ని ప్ర‌భావ శీల‌క మార్పులు వ‌స్తే స‌జ్జ‌నార్ కృషి ఫ‌లితం ఇచ్చిన‌ట్లే!

ర‌ద్దీగా ఉండే రోడ్ల‌పై ఓ సామాన్య ప్ర‌యాణికుడి జీవితం వేరు. ఓ ఎంపీ ప్ర‌యాణం వేరు. ఎండీ మామూలు వ్య‌క్తి కాదు. సంచ ల‌నాత్మ‌క శ‌క్తి. ఆయ‌న పేరు స‌జ్జ‌నార్. గ‌తంలో సైబ‌రాబాద్ సీపీగా ప‌నిచేశారు. ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయ‌నిప్పుడు ఆర్టీసీ ఎండీ. ఈ ప‌ద‌విలోనూ త‌న‌దైన ముద్ర వేసుకోవాలి అని త‌పిస్తున్నారు. సామాన్యుల‌తో ప్ర‌యాణించి వారి క‌ష్ట సుఖాలు తెలుసుకుని, ఆర్టీసీ సేవ‌ల మెరుగుద‌ల‌కు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయ‌నో స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.


ల‌క్డీకాపూల్ నుంచి సీబీఎస్ మీదుగా అఫ్జ‌ల్ గంజ్ చేరుకునే బ‌స్సు ఎక్కి సామాన్య ప్ర‌యాణికుల‌తో క‌లిసిపోయారు. సీబీఎస్ ద‌గ్గ‌ర దిగి అక్క‌డ ప‌రిసరాల‌ను గ‌మ‌నించారు. అక్క‌డి నుంచి ఎంజీబీఎస్ వ‌ర‌కూ న‌డుచుకుంటూ వెళ్లి మూడు గంట‌ల పాటు గ‌డిపారు. మ‌రుగుదొడ్ల నిర్వ‌హణ‌పై సిబ్బంది ప‌లు సూచ‌న‌లు చేశారు. మ‌రోవైపు ఆర్టీసీ బ‌స్సుల‌పై అశ్లీల చిత్రాలు ఉంచడంపై ఓ నెటిజ‌న్ మండి ప‌డ్డారు.స‌మ‌స్య ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు. వెంట‌నే ఆయ‌న స్పందించి ఇక‌పై ఇలాంటివి ఉండ‌వ‌ని చెప్పారు. దీంతో ఎండీ ప‌నితీరుపై ప్ర‌శంస‌ల వాన కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg