ఓడిపోతే ఏమౌతాడు.అదే పెద్ద ప్ర‌శ్న. టీఆర్ఎస్ మాత్రం ఓడిపోతే ఏమౌతుంది. ఎవ్వ‌ర‌యినా ఓడిపోతే ఇంటికి ఎందుకు ప‌రిమితం కావాలి. ఎంచ‌క్కా మ‌ళ్లీ రోడ్డెక్కాలె..అర‌వాలె. మళ్లీ జింద‌గీలో తిర‌గాలె.. మ‌రి! రేవంత్ ? ఇన్నేళ్ల రాజ‌కీయ చ‌రిత్రలో ఎవ్వ‌రూ ఇలా కేసీఆర్ ను తిట్ట‌లేదు. ఆ విధంగా త‌న‌ని తాను గొప్ప‌గా నిర్ణ‌యించుకుని రాజ‌కీయం చేయ‌డంలో రేవంత్ ముందున్నాడు. ఇలా ఉండ‌డం మంచిదా కాదా?


ఇంటి పార్టీని ఇర‌కాటంలో పెట్టేవారంతా మొనగాళ్లే తెలంగాణ‌లో! అందుకే ప్ర‌తి ఒక్క‌రూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంటారు. రేవంత్ కూడా అలానే ముందుకు వ‌చ్చారు. త‌న సామాజిక‌వ‌ర్గం నుంచి కొంద‌రు నేత‌ల‌ను మ‌ద్ద‌తుగా అందుకున్నారు. రేవంత్ కు మ‌ద్ద‌తు ఎలా ఉన్నా, రేప‌టి వేళ అనుకున్న‌ది సాధించ‌లేక‌పోతే మీడియా జోక‌ర్ రేవంతే అవుతాడ‌ని, మ‌రో బండ్ల గ‌ణేశ్ అవుతాడ‌ని అప్పుడే గులాబీ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో ఇలానే బ్లేడ్ తో కోసుకుంటాను లేదా రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాను అని తెగ రెచ్చిపోయిన గ‌ణేశ్ ఆఖ‌రికి ఏదో ఆవేశంలో అనేశాన‌ని స‌ర్ది చెప్పుకున్నాడు. ఇప్పుడు రేవంత్ కూడా ఇలానే ఉన్నాడు. నోటికి వ‌చ్చిందంతా వాగి హీరో అవ్వాల‌న్న త‌ప‌న‌లో ఉన్నాడు.


తెలంగాణ‌లో ఎటు చూసినా రేవంత్ రేవంత్ అని క‌ల‌వ‌రింత‌లే విన‌ప‌డుతున్నాయి. ఈ విధంగా వినిపించ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏంట‌న్న‌ది తెలియాలి అంటే ఎన్నిక‌ల దాకా ఆగాల్సిందే! ముఖ్యంగా రేవంత్ దూకుడు కార‌ణంగానే టీపీసీసీ చీఫ్ ఇచ్చార‌న‌న్న వాద‌న కూడా ఉంది. గ‌తంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి క‌న్నా స్పీడులో రేవంత్ ఉన్నాడ‌న్న టాక్ ఇప్ప‌టికే ఉంది. దీని వ‌ల్ల ఆయ‌న అన‌వ‌స‌ర త‌గాదాల్లోనూ ఇరుక్కుంటున్నాడు. విష‌యం లేకుండా కొన్ని సార్లు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ టార్గెట్ చేసిన ప్ర‌తిసారీ ఏదో ఒక సంచ‌ల‌న విష‌యం మాత్రం ఛానెళ్ల‌కు ఇస్తున్నాడు. తాను ఛానెళ్ల కోసం లేన‌ని ప్ర‌జ‌ల కోస‌మే ఉన్నాన‌ని చెప్పినా, ఆయన మాట‌లూ,  చేత‌లూ అన్నీ మీడియాలో హైలెట్ అయ్యేందుకు ప‌డ్డ తాప‌త్రయంలో భాగ‌మే. ఇప్ప‌టికిప్పుడు కాంగ్రెస్ పెద్ద‌గా పుంజుకోక‌పోయినా ఇలాంటి ఇంటి సేవ‌కుడు ఒక్క‌డు త‌ప్ప‌కుండా ఉండాల‌న్న భావ‌న‌లో సోనియా ఉన్నారు. ప‌ద‌వి కోసం ప‌రిత‌పిస్తూ పోయే సీనియ‌ర్ల ద‌గ్గ‌ర రేవంత్ రాణిస్తాడా? అదేవిధంగా రేవంత్ చేస్తున్న పోరాటం ఎందాక‌?

మరింత సమాచారం తెలుసుకోండి:

tg