తెలంగాణ‌లో హుజూరా బాద్ ఉప ఎన్నిక తేదీ ద‌గ్గ‌ర ప‌డుతోన్న కొద్ది తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎక్క‌డా లేని టెన్ష‌న్ స్టార్ట్ అవుతోంది. ఎందుకంటే ఏ ఉప ఎన్నిక జ‌రిగినా కూడా తిరుగులేకుండా గెలుస్తామ‌న్న అతి ధీమా కేసీఆర్ లో ఎప్పుడూ ఉండేది. అయితే ఇప్పుడు అది పూర్తిగా రివ‌ర్స్ అవుతోంది. ఎందుకంటే కేసీఆర్ కంచుకోట అయిన సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అస‌లు బీజేపీ గెలుస్తుంద‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు. అది గులాబీ పార్టీకి కంచుకోట‌. అంత‌కు ముందే సాధార‌ణ ఎన్నిక‌ల్లో అక్క‌డ నుంచి టీఆర్ ఎస్ దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగా రెడ్డి ఏకంగా 62 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించారు. చివ‌ర‌కు కేసీఆర్ సైతం ఈ ఉప ఎన్నిక ప్ర‌చారానికి కూడా వెళ్ల‌లేదు. చాలా లైట్ తీస్కొని అతి ధీమాతో తామే గెలుస్తామ‌ని బీరాలు పోయారు.

క‌ట్ చేస్తే అక్క‌డ బీజేపీ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దుబ్బాక రిజ‌ల్ట్ ఉత్సాహంతోనే జీ హెచ్ ఎంసీ లో సైతం కారు పార్టీకి షాక్ ఇచ్చే రేంజ్‌లో కార్పొరేట‌ర్ స్థానాలు గెలుచు కుంది. ఆ ప్ర‌భావం రాష్ట్రం అంత‌టా చూపించింది. ఇప్పుడు హుజూరా బాద్‌లో కూడా అదే ఫ‌లితం రిపీట్ అయితే కేసీఆర్ హ‌వాకు చాలా వ‌ర‌కు బ్రేకులు ప‌డిపోయిన‌ట్ల‌వుతుంది. కేవ‌లం ఈ ఉప ఎన్నిక కోస‌మే ద‌ళిత బంధు ప‌థ‌కం పుట్టుకొచ్చింది అంటే పెద్ద‌గా ఆశ్చ‌ర్య ప‌డాల్సిన ప‌నిలే దేమో..!

ఇక అధికారం చేతిలో ఉండ‌డంతో టీఆర్ ఎస్ కులాల వారీగా నేత‌ల‌ను దింపేసి.. ప‌థ‌కాలు ఇస్తూ వారిని త‌మ వైపున‌కు తిప్పు కునేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. చివ‌ర‌కు కేసీఆర్ సైతం హుజూరాబాద్ లో చివ‌రి మూడు రోజులు లేదా రెండు రోజుల పాటు రోడ్ షోలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇంత ప్లానింగ్ ఉన్నా కూడా దుబ్బాక‌లో ర‌ఘునంద‌న్‌పై ఉన్న సింప‌తీ ముందు టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం ప‌ని చేయ‌లేదు. ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా అదే రిపీట్ అవుతుందా ? అన్న టెన్ష‌న్ కేసీఆర్ ను అయితే వెంటాడుతోంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: