వైసీపీ ఆవిర్భావం నుంచి నిన్న మొన్నటి వరకు తన వెన్నంటే ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి పై వైఎస్ జగన్ ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవ‌ల‌ తాడేపల్లి ప్రెస్‌మీట్ లో జగన్ మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయార‌ని.. కూటమికి మేలు చేయడం కోసం మూడున్న‌ర సంవ‌త్స‌రాల ట‌ర్మ్ ఉండ‌గానే ఆయ‌న త‌న రాజ్యసభ పదవికి రాజీనామా చేశార‌ని విమర్శించారు.


వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేదు.. మళ్లీ రాజ్యసభకు పంపించే అవకాశం ఉండదని తెలిసి.. తన రాజీనామాతో చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి, ప్రలోభాలకు లోనై త‌న ప‌ద‌విని అమ్ముకున్నారంటూ సాయిరెడ్డిపై జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు చేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్ల గురించి ఏం మాట్లాడతాం అంటూ జ‌గ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అయితే తాజాగా జ‌గ‌న్ ఆరోప‌ణ‌ల‌పై మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత సాయిరెడ్డి స్పందిస్తూ మాస్ కౌంటర్ ఇచ్చారు.


`నేను మార‌లేదు. నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. పదవి రాగానే మారిపోయింది నువ్వే. గ‌త మూడు ద‌శాబ్దాల నుండి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుటుంబంతో సంబంధాలు ఉన్నారు. నేను ప్రలోభాలకు లొంగను. ఎవరికీ భయపడిందీ లేదు. విశ్వసనీయత కోల్పోయే తత్వం నాది కాదు. గ‌తంలో మా నాయ‌కుడి, ప్ర‌స్తుతం దేవుడిపై భ‌క్తి ఎప్పుడూ ఉంది. అనేక‌ అవమానాలు ఎదుర్కొన్నాను. బాధలు భరించలేక తప్పుకున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను` అంటూ జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చారు విజయ సాయి రెడ్డి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: