
ఏపీలో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూడాలని ప్రయత్నిస్తుంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు ప్రభుత్వం విషయంలో కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ తెలిపారు. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్కసారైనా సీఎం చంద్రబాబును కలవలేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
కేవలం సినిమాల రిలీజ్ సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చినా పట్టించుకోలేదని పవన్ అన్నారు. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ ను తగిన విధంగానే స్వీకరిస్తానని పవన్ చెప్పుకొచ్చారు. ఇకపై వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావు లేదని పవన్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీలోని మల్టీప్లెక్స్ నిర్వహణ, టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఘాటు ప్రకటన ఇండస్ట్రీకి ఒక విధంగా షాక్ అని చెప్పవచ్చు. ఈ ప్రకటన విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. పవన్ రియాక్షన్ తో ఏపీలో థియేటర్ల బంద్ ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెర వెనుక చక్రం తిప్పుతున్న వాళ్లకు పవన్ కళ్యాణ్ ఘాటుగానే బదులిచ్చారని చెప్పాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు