
గతేడాది ఈ స్కీమ్ అమలు కాకపోయినా ఈ ఏడాది స్కీమ్ దిశగా అడుగులు పడుతుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు కొంతమేర కఠినంగా ఉండకపోతే మరింత ఎక్కువమందికి ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. తల్లికి వందనం నగదు ఖాతాలో జమ అవుతూ ఉండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాబు పాలనలో సంక్షేమం మొదలైందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
తల్లికి వందనం స్కీమ్ అమలు నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని పథకాల అమలు దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. అన్న వర్గాల ప్రజలకు మేలు జరిగే పథకాలపై ప్రభుత్వం ద్రుష్టి పెడుతూండటం గమనార్హం. ఏపీ సర్కార్ అమలు చేసే పథకాల వల్ల పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఊహించని స్థాయిలో ప్రయోజనం పొందుతున్నారు.
తల్లికి వందనం పథకం విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే గ్రామ, వార్డ్ సచివాలయాలను సంప్రదించడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ స్కీమ్ అమలు కోసం దాదాపుగా 9 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుండటం గమనార్హం. తల్లికి వందనం స్కీమ్ కూటమి సర్కార్ అమలు చేస్తున్న పథకాలలో బెస్ట్ స్కీమ్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు