B-2 స్పిరిట్.. ఈ బాంబర్ విమానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆసక్తి కలిగించేలా చేస్తోంది. అమెరికా ఏదైనా కష్టమైన ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడల్లా కూడా ఈ విమానాలను గాలిలో ఎగురవేసి యుద్ధాలను ప్రారంభించి ముగించేస్తారు. కొన్ని గంటలపాటు గాలిలో ప్రయాణించి లక్ష్యాన్ని చేదించి మరి తిరిగిరాగలిగిన సామర్థ్యం కలదు
B-2 స్పిరిట్. దీనిని 1999లో కొసావో యుద్ధంలో మొదటిసారిగా ఉపయోగించారు. గతంలో ఉండే B 1 లాన్సర్, ఫోర్ట్రస్ట్,B -52 స్ట్రాటో, F -117 నైట్ హక్కు వంటి విమానాల కంటే చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.


B-2 స్పిరిట్ విమానాన్ని అమెరికాకు చెందిన నార్త్ ఆఫ్ గ్రూమన్ సంస్థ ఈ విమానాన్ని సృష్టించింది. దీనిలో వాడిన ప్రతి పరికరం కూడా ఆ సంస్ధ మొదటి నుంచే పరిశీలించి మరి తయారుచేసింది. టూల్స్, సాఫ్ట్వేర్, కాంపోజిట్ మెటీరియల్ , 3D యాంగిల్, కంప్యూటర్ సిస్టం ఇలా అన్నిటిని కొత్త ప్రక్రియగా సిద్ధం చేసింది.


అమెరికా మీద దాడి చేస్తే.. మొదటి రోజు రాత్రి ఈ దాడులను ప్రత్యర్థి గగనతలంపైకి కూడా ఈ విమానం వెళుతుంది B-2 స్పిరిట్ విమానం.. షర్మియాపై ఆపరేషన్  అలైడ్ ఫోరమ్స్, ఇరాక్ పై ఆపరేషన్ ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ పై ఎండ్యూరింగ్ ఫ్రీడం , ఆపరేషన్ ఒడిస్సీ డాన్ వంటివి చేపట్టింది. అలాగే ప్రపంచంలో ఏ యుద్ధరంగంలో అయినా సరే తట్టుకొని మరి నిలబడిన విమానం ఇది.


2001లో జీ స్పిరిట్ ఆఫ్ అమెరికా.. 5 B -2 బాంబార్లు కలిసి ఆఫ్ఘనిస్తాన్ గగనతనంలోకి  వెళ్లి మరి బాంబుల దాడి చేసింది. సుమారు 44 గంటల పాటు ప్రయాణం చేసింది కేవలం సర్వీస్ మార్పుల కోసం 45 నిమిషాల పాటు ఆగింది. సుమారుగా 70 గంటలకు పైగా ఇంజన్లు పనిచేస్తూనే ఉన్నాయట.



ఇక హాలీవుడ్ పరిశ్రమలో కూడా B-2 స్పిరిట్ ఒక సూపర్ స్టార్ల ఎంట్రీ ఇచ్చింది. సినిమాలలో కూడా ఈ విమానం అవసరమైనప్పుడల్లా చూపించారు.


ఇక పైలెట్లు కూడా సుదీర్ఘంగా గాలిలో ప్రయాణించాల్సిన అవసరం ఉన్నప్పుడు వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా అందులోనే ఉంటాయి. ఇందులో పాలు, బ్రెడ్ ,చాక్లెట్ శాండిల్విస్, డ్రింకులతో పాటు స్నాక్స్ కూడా ఉంటాయి. అలాగే సిబ్బంది కాలకృత్యాలు కూడా తీర్చుకునేలా అందులో టాయిలెట్లు కూడా అమరిచారు. ఒకవేళ అవసరమైతే విశ్రాంతి తీసుకుని వీరుగా బెద్దులు కూడా అమరచారట. B-2 స్పిరిట్ మరింత అప్గ్రేట్ చేయడానికి సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: