తెలంగాణ రాష్ట్రం లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా మారింది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి లోకల్ కాండిడేట్ నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. అలాగే బీజేపీ నుంచి లోకల్ నాయకుడు లంకల దీపక్ రెడ్డి ని బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసేసింది. ఈ ఉత్కంట పోరులో ముగ్గురిలో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ముస్లిం ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా పరిస్థితి తయారయింది.

 అయితే ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ గెలవాలి అంటే  కొన్ని సంఘటనలు అక్కడ జరగాలి.  ముఖ్యంగా ముస్లిం ఓట్లు వన్ సైడ్ పడకుండా చీలిపోవాలి. అంతేకాకుండా ఎంఐఎం నుంచి కూడా  ఎవరైనా అభ్యర్థి పోటీలో ఉండాలి. అంతేకాదు బీజేపీ నాయకుడి తరఫున మోడీ లాంటి పెద్ద నాయకుడు వచ్చి ప్రచారం చేస్తే లంకల దీపక్ రెడ్డికి హైప్ పెరుగుతుంది. ఈ విధంగా ముస్లిం ఓట్లు చీలిపోయి, హిందువుల ఓట్లు దీపక్ రెడ్డికి పడితే మాత్రం తప్పకుండా జూబ్లీహిల్స్ బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఇలా జరగడం సాధ్యమవుతుందా కాదా అనేది ముందు ముందు తెలుస్తుంది. కానీ లంకల దీపక్ రెడ్డికి టికెట్ మాత్రం చాలా లేటుగా ఇచ్చేశారు.

ఒక నెల రోజుల ముందుగానే ఇచ్చి ఉంటే మాత్రం అక్కడ బిజెపి  తప్పకుండా గెలిచే అవకాశం ఉండేదని తెలియజేస్తున్నారు.కానీ బీజేపీ అధిష్టానం అక్కడ సీటు ఎలాగైనా గెలవదని చెప్పి లంకల దీపక్ రెడ్డిని లేటుగా ప్రకటించిందని అంటున్నారు. ఒకవేళ ఆయనకు ముందుగానే టికెట్ ప్రకటించి ఉంటే ఇది వరకు జూబ్లీహిల్స్ లో ఆయన పూర్తిస్థాయిలో ప్రచారం చేసి ఉండేవారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో కిషన్ రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ సమయం ఉంటే ఆయన దాన్ని వాడుకొని గెలుపు తీరాలకు వెళ్ళేవాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మరి చూడాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో గెలుపు ఏ పార్టీదో ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: