మనిషి ఎంత ఎదిగితే అంత ఒదగాలంటారు పెద్దలు. ఎందుకంటే ఎప్పుడైన ఎదుగుట విరుగుట కొరకే. అందుకే మన జీవన విధానం సాధారణంగా ఉంటే ఎదిగినా పడినా జీవితంలో ఇబ్బందులు రావు. అలాగే ప్రతి ఒక్కరు తాను నిర్వహించే పదవినిబట్టే ప్రొటోకాల్ విధానం ఉంటుంది. ప్రతి పదవికి వెర్వేరు  ప్రొటోకాల్స్ అను సరణీయం. 

మనం ఎంత గొప్ప మెధావులం అయినా ఎంత అనుభవం ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులమైనా దేశ ప్రధానికి ఉంటే ప్రోటోకాల్స్ మనకు లభించవు ఎందుకంటే ఆ ప్రొటోకాల్స్ మరో విధంగా "అలంకరించిన పదవి పరంగా లభించే మర్యాదలు" మరో పదవికి మరో విధంగా ఉంటాయి.
తనిఖీలకే బెదిరిపోతే ఎలా బాబూ.!
ఎంత అనుభవమున్నా ముఖ్యమంత్రి పదవి వలన లభించే ప్రోటోకాల్స్ ఆ రాష్ట్ర ప్రతిపక్షనేతకు ఎప్పటికి లభించవు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ లో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని సిబ్బంది తనిఖీలు చేయడంతో ఆయనతో పాటు తెలుగుదేశం తమ్ముళ్ళు అంతకు మించి తెలుగుదేశం మద్దతు మీడియా ఉలిక్కిపడ్డారు. అవి అన్నీ అతి సాధారణ సాధారణ తనిఖీలే, గతంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి కూడా ఇలాంటి తనిఖీలనే ఎదుర్కొన్నారు. అంతెందుకు రాష్ట్రపతి పదవిని త్యాగం అనంతరం మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం అంటే భారత ప్రథమ పౌరుడు పదవి నుండి బయటపడ్డప్పుడు ఆయన ఇదే ప్రొటోకాల్స్ ను అనుభవించారు. అలా అని ఆయన ఎప్పుడూ తనకు లభించిన ప్రొటొకాల్స్ తక్కువయ్యాయని ఆయన ఆవేదన చెందలేదు. 
Image result for chandrababu budda venkanna
నాడు ఇదే విషయాన్ని జగన్ విషయంలో వైసీపీ నేతలు ప్రస్తావిస్తోంటే, "అప్పటి ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు, ఇప్పటి అతి సామాన్యుల్లో ఒకడైన వైఎస్‌ జగన్‌ మోహన రెడ్డి ఇద్దరూ ఒకటేనా? మా చంద్రబాబు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ చాలా గొప్ప వారు" అంటూ తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు చక్కని హస్యాన్ని పండిస్తుండగా తెలుగు ఒక సామాజిక వర్గ మీడియా శోకాలు పెడుతుందని వైసిపి విజయసాయిరెడ్డి అంటున్నారు. 


నారా చంద్రబాబు నాయుడి వీర భక్తుడిగా పేరొందిన టిడిపి మాజీ ఎమెల్యే బుద్ధా వెంకన్న అయితే, ఈ తనిఖీల అంశం బయటికొచ్చాక ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నారా చంద్ర బాబు భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు అంటూ చాలా పెద్ద పిచ్చ కామెడీ చేశారు. ప్రోటోకాల్‌ అంటే పదవీ మర్యాదలు అనేవి, ఏ పదవి ద్వారా అధికారంలో ఉన్నాము? అన్న దాన్ని బట్టి దాని అనుగుణంగా మారిపోతుంటాయి. ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత, ప్రతిపక్షనేతకు దొరికే ప్రసక్తి ఉండదు.

ముఖ్యమంత్రి పదవిలో వున్నా, లేకపోయినా, తనకు ముఖ్యమంత్రి పదవికి చెందిన ప్రోటోకాల్‌ దక్కాలని చంద్రబాబు ఆశించడం అంటే పదవీ పోయినా ప్రొటోకాల్స్ రావాలను కోవటంలో అర్థమే లేదు. భద్రత విషయంలో ప్రాదమ్యాలు ఉంటాయి. వాటిని అనుసరించే ప్రొటోకాల్స్ నిర్ణయించబతాయి. 

అంటే నారా చంద్రబాబుకు వ్యక్తిగా ఎలాంటి ప్రొటోకాల్స్ ఉండవు. ఆయనా కూడా ఎయిర్-పోర్ట్ కు వెళితే తనికీలు మనకు లాగే ఉండాలి. అంతేగాని ముఖ్యమంత్రికే స్వంతమైన ప్రొటోకాల్స్ ప్రతిపక్ష నాయకునికి లభించటంలో అర్ధం లేదు. ఇది ఆయనకే భజనచెసే ఆయన సామాజిక మీడియా గుర్తిస్తే కనీసం ఇప్పటి కైనా జనం హర్షిస్తారు. లేకుంటే వాటికి క్రమంగా తిలోదకాలే! అనే అభిప్రాయం జనంలో వ్యక్తమౌతుంది. ఇక ప్రొటోకాల్ని ప్రశ్నించటం తెలుగు తమ్ముళ్ళు ముఖ్యంగా బుద్దా వెంకన్న లాంటి వాళ్లు మానేస్తే మంచిదని జనం బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ఇక చంద్రబాబు అంటారా ఆయన ఆశ్రిత, సామాజిక వర్గ, పార్టీ అనుచరుల, టిడిపి కార్యకర్తల పక్షపాతి మాత్రమే కాని ప్రజల మనిషి కారు, కానేరరు. చంద్రబాబు మారరు. ఆయన అంతే. ఇంకా ఆయన అపజయాన్ని ఆయన గుర్తించరు. చంద్రబాబు వ్యవహారం ప్రస్తుతం మనకు అనవసరం అంటున్నారు ఏపి ప్రజలు. ప్రతిపక్షనేతగా ఆయన సరిగా మనగలిగితే నైనా కొంత గౌరవం మిగులుతుంది. లేకపోతే "ఇతనింతే" అనటం తధ్యం. 


వైఎస్‌ జగన్మోహనరెడ్డి మీద గతంలో విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నమే జరిగింది. ఆనాడు అదీ చంద్రబాబు హయాంలో, అప్పటి ప్రతిపక్షనేతకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భద్రతను ప్రశ్నిస్తే "అబ్బే! ఆ భద్రత మా పరిధిలోకి రాదు. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వున్న ప్రాంతం" అని టీడీపీ ప్రభుత్వంలోని అధికార అనధికార రాజకీయ నాయకులు చంద్రబాబు లోకెష్ లతో కలిపి తమ భాద్యలేదన్న విషయం మనకు మరపు లోకి రాదు. చంద్రబాబు విషయంలోనే కాదు, టీడీపీ కి సంబంధించిన చాలా మంది నేతలు ఇప్పుడు పదవుల్లో ఉన్నప్పటి భద్రతను పదవులు కొల్పోవటం ద్వారా కోల్పోనున్నారు.

కొందరికి సెక్యూరిటీ కొనసాగిస్తోంటే, ఇంకొందరికి వున్న సెక్యూరిటీని తొలగిస్తున్నారు. ఇదంతా సాధారణంగా జరిగే వ్యవహారమే. ఏదో ఒక విషయాన్ని పట్టుకుని రాద్ధాంతం చెయ్యాలి అందులో టీడీపీ మేటి కనుక, తెలుగు తమ్ముళ్ళు అగ్గి రాజేస్తుంటే తెలుగు పచ్చ మీడియా దానికి ఆజ్యం పోయటం మామూలే. పదవిలో లేని అధికారంలోలేని వాళ్ళు అధికార దర్పం ప్రదర్సిస్తే జనంలో అభాసుపాలవటం ఖాయం. అందుకే అంటారు అధికారాంతమందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్ అని.         

మరింత సమాచారం తెలుసుకోండి: