మానవుల జీవితంలో కొన్ని సార్లు కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. కొన్ని విషయాలు విన్నప్పుడు ఇలా కూడా జరుగుతుందా అనే సందేహాలు వస్తాయి.రష్యాలో ఇలాంటి విచిత్ర ఘటన ఒకటి చోటు చేసుకుంది. 223 మంది ప్రయాణికులతో వెళుతున్న ఎయిర్ బస్ 321 అనే విమానం మాస్కో శివారు ప్రాంతమైన మొక్కజొన్న చేనులో అత్యవసర పరిస్థితులలో ల్యాండ్ అయింది. 
 
విమానానికి పక్షుల గుంపు అడ్డు రావటంతో పైలెట్ వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసాడు. విమానానికి అడ్డు వచ్చిన పక్షుల గుంపులోని కొన్ని పక్షులు విమానం యొక్క ఇంజిన్ లో చిక్కుకున్నాయి. పక్షులు ఇంజిన్ లో చిక్కుకోవటంతో విమానానికి సాంకేతిక సమస్యలు వచ్చాయి.ఉన్నతాధికారులకు సమాచారం అందించిన పైలెట్ వారి అనుమతితో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసాడు. విమానంలోని ప్రయాణికులకు కొద్ది సమయం పాటు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొత్తం 223 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఈ విమానంలో 23 మంది స్వల్పంగా గాయపడ్డారు. విమానంలోని ప్రయాణికులెవరికీ ప్రాణ నష్టం జరగలేదు. పైలెట్ సేఫ్ గా ల్యాండ్ చేయటంతో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానం యురల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంగా తెలుస్తుంది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయంపై స్పందించారు. 
 
పైలెట్ సమయస్పూర్తి వలనే ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. హుకోవుస్కీ అనే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ సంఘటన జరిగింది. విమానం ఎక్కడినుండి బయలుదేరిందో ఎక్కడివరకు ప్రయాణిస్తుందో అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. విమానం సేఫ్ గా ల్యాండ్ అవటంతో ఎయిర్ పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారని సమాచారం అందుతుంది. ఏవియేషన్ అధికారులు మాత్రం ఈ ఘటన జరగటానికి గల కారణాలను గురించి దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: