మనం నాగరికులమైతే ఉన్నత విద్య మన ప్రధాన కర్తవ్యం కావాలి.ఉన్నత విద్యను పొందిన దేశాలు అభివృద్ధి చెందగలవు- ప్రపంచ బ్యాంకు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం,మానవతా విలువలతో కూడిన శాస్త్ర ప్రగతే అంటూ ఉన్నత విద్య ప్రాముఖ్యత ఏంటో చెప్పే వ్యాఖ్యానాలు భారతదేశ ఉన్నత విద్యారంగానికి మార్గ దర్శకాలని చెప్పాలి.భారతదేశంలో మానవ వనరులు అపారంగా ఉన్నాయి.భారతదేశంలో మానవ వనరుల విప్లవాన్ని చూసి ప్రపంచ దేశాలు గడగడలాడు తున్నాయి.ఇటు వంటి ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే విశ్వ విద్యాలయాల విద్యను ఎక్కువ మంది యువతీ యువకులకు అందించగలగాలి.పరిమాణం రీత్యా భారత ఉన్నత విద్యారంగం విస్తరిస్తోంది.కానీ ప్రమాణాల రీత్యా చూస్తే ఆందోళనకర అంశాలు గోచరిస్తున్నాయి.అందుకు ఉదాహరణ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ..



ఈ మధ్యకాలంలో విద్యా వ్యవహారాలపై మునుపెన్నడూ లేనంతగా విస్తృతంగా చర్చ,విమర్శల పరంపర కొనసాగటం హర్షణీయం అనుకుంటున్న సమయంలో ఎస్వీయూ ను కించ పరిచే విధంగా వున్న సంఘటన పట్ల పలువురు విచారణ వ్యక్తం చేస్తున్నారు.ఈ సమాజంలో ప్రత్యేకించి ఆలయాలంటు ఉన్నాయంటే అవి విశ్వవిద్యాలయాలే. దేవుడున్న ఆలయాల్లో ప్రసాదం దొరికితే,విశ్వవిద్యాలయాల్లో జీవితం దొరుకుతుందని నమ్మే వారెందరో విద్యార్ధులున్నారు.ఐతే ఎస్వీయూ ను ఆలయంగా భావించే అందరికి వికలాంగుడిని మానసికంగా ఇబ్బంది పెట్టిన సంఘటన అదీ రిజిస్ట్రార్ ఆఫీస్ లోనే జరగడం నిజంగా ఆందోళనకు గురిచేస్తుంది.ఒక విశ్వ విద్యాలయములో ఇటువంటి నడవడి అందులోనూ సాక్షాత్ రిజిస్ట్రార్ చాంబర్స్ లో జరగడము,మాటల దాడి, హావ భావ దాడి,మానసిక దాడి అందులోనూ ఒక వికలాంగుడిపై దాదాపు ఆరు మంది నుండి పది మంది వరకు దాడి చేసిన విధానం సమాజానికే సిగ్గు చేటు తెచ్చే విధంగా ఉందని సాక్షాత్ ఎస్వీయూ సిబ్బందే చెవులు కోరుక్కుంటున్నారట.



ఈ సంఘటన చూస్తుంటే మంచికి రోజులు దగ్గరపడి అమాయకులను దోచుకునే దోపిడి మూఠాలను యూనివర్శిటిలో తయారు చేస్తూన్నారని అనిపిస్తుంది. సమాజాన్ని తీర్చిదిద్దే వ్యక్తులే తప్పులు చేస్తే ఇక నవసమాజ నిర్మాణం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు కొందరు..? ఇక విశ్వ విద్యాలయాలలో పని చేసే సిబ్బంది అయితే ఆ ప్రాంతాన్నే కాదు..మొత్తం జాతి ని ప్రభావితం చేయగలవారు కాబట్టి వారి ప్రవర్తన మంచికి సోదాహరణముగా ఉండాలేగాని వెగటు పుట్టేలా వుండకూడదని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు....

మరింత సమాచారం తెలుసుకోండి: