ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఛాతినొప్పితో గత నెల 23వ తేదీన హాస్పిటల్‌లో చేరారు. గత నెల అంత వివాదాలలో పడిన అయన ఒక్కసారిగా వివాదాలు వచ్చేసరికి గుండె నొప్పి వచ్చి ఆరోజు రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆరోజు నుంచి అజ్ఞాతంలో కోడెల శివ ప్రసాద్ రావు ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అతని ఇంట్లోనే మధ్యాహ్నం కోడెల తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అయన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందారు.              

 

హైదరాబాద్‌లో ఉన్న అసెంబ్లీ నుంచి అమరావతికి తరలించాల్సిన సామగ్రిని తన సొంత ఇంటికి, తన కుమారుడి షోరూమ్‌కి తరలించారని ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆయన కూడా అంగీకరించారు. ఆఫీసులో స్థలం లేకపోవడం వల్ల తన వద్ద భద్రపరిచానని, కావాలంటే తీసుకుని వెళ్లొచ్చని కూడా చెప్పారు. ఓ స్పీకర్‌గా పని చేసిన ఆయన ఇలా కుర్చీలు, బెంచీలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ ఇంటికి తీసుకుని వెళ్లడం రాజకీయాల్లో పెనుదుమారానికి దారితీసింది.                        

 

మరోవైపు 2018లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నుంచి 30 ల్యాప్‌టాప్‌లు తీసుకెళ్లారంటూ కోడెల మీద క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. కాగా కోడెల శివ ప్రసాద్ కూతురు, కొడుకుపై పలు ఆరోపణలు నమోదు అయినా సంగతి తెలిసిందే. ఇలా నిజాలు అన్ని బయటకి రావడంతో అయన ఆత్మహత్య చేసుకున్నారు. కాగా అయన ఈరోజు హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.                                   


మరింత సమాచారం తెలుసుకోండి: