బస్సులో వెళదామంటే ఈరోజు ఆదివారం, అది కూడా వర్షం పడుతుంది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బయదేరితే అర్ధరాత్రి ఇంటివద్ద దిగుతాం దీనికంటే మెట్రో బెటర్ ఫాస్ట్ గా వెళ్తాము అని అందరూ మెట్రోకి వస్తారు. మెట్రోలో కన్ఫ్యూషన్ అయినా అటు ఇటు తిరుగుతూ మెట్రోకి వెళ్లాలనుకుంటారు.                 


అమీర్ పెట్ మెట్రో అయితే ఇంకా మనకు కావాల్సిన స్టేషన్ జంక్షన్ వెతుకోడానికి దాదాపు 15నిముషాలు పడుతుంది. ఎందుకంటే అమీర్ పెట్ జంక్షన్ కాబట్టి. ఇంకా విషయానికి వస్తే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రాణాంతకంగా మారాయి. హైదరాబాద్ అమీర్ పెట్ వద్ద నిల్చున్న ఓ మహిళపై స్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడి పడ్డటంతో  మహిళా ప్రాణాలు కోల్పోయింది.                        


ఈరోజు సాయింత్రం సిటీలో భారీ వర్షం కురుస్తుండటంతో అమీర్ పెట్ వైపు వెళ్తున్న మహిళా మెట్రో స్టేషన్ కింద తలదాచుకుంది. కానీ ఊహించని రీతిలో ఆమె పై నుంచి పెచ్చులు ఊడి ఆమె తలపై పడ్డాయి. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయి అని ప్రత్యేక్షులు చెబుతున్నారు.                     


వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ ఘటనతో హైదేరాబద్ మెట్రో నిర్మణం ఎంత నాణ్యంగా నిర్మించారన్నది బయటపడింది. మెట్రో ప్రారంభించి కనీసం 2 సంవత్సరాలు కూడా జరగలేదు అప్పుడే ఈ మెట్రో నాణ్యత తెలుస్తుంది అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.         


మరింత సమాచారం తెలుసుకోండి: