యూఏఈ వేదిక గా టీ ట్వంటి ప్ర‌పంచ కప్ మ్యాచ్ లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 31న న్యూజీలాండ్ ను టీమిండియా ఢీ కొట్ట బోతుంది. అయితే న్యూజీ లాండ్, ఇండియా ఇప్ప‌టికే త‌ల ఒక మ్యాచ్ ఆడాయి. అయితే ఈ రెండు జ‌ట్లు కూడా త‌మ మొద‌టి మ్యాచ్ ల‌లో ఓట‌మి పాల‌య్యాయి. అయితే న్యూజీ లాండ్ , టీమిండియా రెండు కూడా పాకిస్థాన్ జట్టు పై నే ఓడిపోయాయి. దీంతో ఈ రెండు జ‌ట్లు త‌మ త‌ర్వాత పోరు కు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 31 న ఈ రెండు జ‌ట్లు త‌ల ప‌డ బోతున్నాయి. అయితే మొద‌టి మ్యాచ్ ను ఇరు జట్లు ఓడి పోవ‌డం తో ఈ మ్యాచ్ పై ఇరు జ‌ట్లు చాలా సిరియ‌స్ గా తీసుకుంటున్నాయి.



టీమిండియా ఇప్ప‌టికే న్యూజీ లాండ్ తో త‌ల ప‌డ‌టానికి స‌న్న‌ద్ధం అవుతుంది. అలాగే టీమిండియా త‌ప్ప‌క ఓడించి త‌మ ప‌రువు నిలుపు కోవాల‌ని న్యూజీ లాండ్ కు ఎత్తు కు పై ఎత్తు వెస్తుంది. అయితే టీమిండియా తో జ‌ర‌గ బోయే మ్యాచ్ కు న్యూజీ లాండ్ కొన్ని మార్పుల చేర్పులు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. అయితే న్యూజిలాండ్ జ‌ట్టు కు గాయాల బెడుత ఎక్కువ గా ఉంది. ఇప్ప‌టికే న్యూజిలాండ్ పేస‌ర్ ఫెర్గూస‌న్ గాయం కార‌ణంగా టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. అలాగే ఆ దేశ ప్ర‌ముఖ బ్యాట‌ర్ మార్టిన్ గ‌ప్ఠిల్ కు కూడా పాక్ తో జ‌రిగిన మ్యాచ్ లో గాయం భారిన ప‌డ్డాడు. దీంతో గ‌ప్టిల్ తుది జ‌ట్టు లో ఉంటాడా అనే అనుమానం క‌లుగుతుంది. అయితే గ‌ప్టిల్ గాయం తో తుది జ‌ట్టు లో ఉండ‌క పోతే టీమ్ సీఫెర్డ్ ను జ‌ట్టు లోకి తీసుకునే అవ‌కాశం ఉంది. అలాగే టీమ్ సీఫెర్ట్ న్యూజిలాండ్ జ‌ట్టు కు ఓపెన‌ర్ గా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే పాక్ తో జ‌రిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆట‌గాళ్లు ప‌రుగులు చేయ‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డారు. మ‌ళ్లి అలాంటి ప‌రిస్థితి రాకుండా త‌గు జ‌గ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: