నేడు ఐపీఎల్ లో భాగంగా ఒక ఆసక్తికర పోరు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. పాయింట్ల  పట్టికలో మూడవ స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్  నాలుగవ స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ రెండు జట్లలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ కోసం ఇప్పటి నుంచే ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. అయితే నేడు జరగబోయే మ్యాచ్ లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడితే ఓడిన జట్టు ఇక నేరుగా ఇంటి బాట పడుతుంది.


 ఈ క్రమంలోనే చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించాలంటే ఏదో ఒక లక్ ఫ్యాక్టర్ కలిసి రావాలి అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ను తేలికగా తీసుకోవద్దు అంటూ ప్రత్యర్థులకు సూచించాడు. లీగ్ దశలో ఆఖరి నాలుగు మ్యాచ్ల్లో బెంగళూరు జట్టు మూడింటిలో విజయం సాధించిందని డేంజరస్ గా ఆడుతుందని చెప్పుకొచ్చాడు.


 బెంగళూరు జట్టు వరుసగా మూడోసారి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇతర జట్లు అన్నీ కూడా బెంగుళూరు ను చూసి ఆందోళనకు గురవుతున్నట్లు కనిపిస్తూ ఉంది. అయితే గుజరాత్ జట్టు మీద విజయం సాధించడంతో పాటు అదృష్టం కలిసి రావడం అటు విరాట్ కోహ్లీ లాంటి కీలక ఆటగాడు మునుపటి ఫామ్ లోకి రావడం అటు ప్రత్యర్థి జట్లకు ఆందోళన కలిగించే అంశం.. అందుకే మిగతా జట్లకు బెంగుళూరు ను చూసి కంగారు పడటం ఖాయం అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ గ్రేమ్ స్వాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb