ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో దాదాపు ఇరవై మూడేళ్ల పాటు భారత క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించి ఏకంగా మహిళా క్రికెట్ ను శిఖరాగ్ర స్థాయిలో నిలిపింది మిథాలీ రాజ్.  ఒక మహిళా క్రికెటర్ గా ఎన్నో రికార్డులను కొల్లగొట్టడమే కాదు ఒక కెప్టెన్గా జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను కూడా అందించింది. ఇక అంతే కాదు మిథాలీరాజ్ సారథ్యంలోనే ఎంతో మంది యువ క్రికెటర్లు అటు భారత మహిళా క్రికెట్ జట్టు లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు అనే చెప్పాలి. ఇలా తన ఆలోచనలతో తన కెప్టెన్సీ తో భారత మహిళ జట్టును ఎంతో పటిష్టవంతంగా మార్చేసింది అని చెప్పాలి. ఇటీవలే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించింది అన్న విషయం తెలిసిందే.


 ఇక మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడం తో ఎంతోమంది అభిమానులు వివేకానికి లోనయ్యారు అని చెప్పాలి. అయితే ఇటీవలే మిథాలీ రాజ్ ఇండియా క్రికెట్ లో చేసిన సేవలను ప్రశంసిస్తూ దేశ ప్రధాని నరేంద్ర ఆమెకు ప్రత్యేకమైన లేఖ రాశారు. ప్రతిభా స్థిరత్వం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండటం ఎంతో అదృష్టం.. నీ ఉత్సాహం ఎంతో మంది క్రీడాకారులలో స్ఫూర్తికి కారణమైందని.. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టావ్.. హద్దుల గోడలు బద్ధలు కొట్టి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చావ్ అంటూ ప్రధాని మిథాలీ రాజ్ ను  నరేంద్రమోడీ లేఖలో ప్రశంసించారు.


 అయితే మోదీ తన కోసం ప్రత్యేకంగా రాసిన లేఖపై స్పందించిన మిథాలీరాజ్ కృతజ్ఞతలు తెలిపింది. తన గురించి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన ఆలోచనాత్మక మాటలతో పొంగి పోయాను అంటూ సంతోషం వ్యక్తం చేసింది మిథాలీ రాజ్. 130 కోట్ల ప్రజలకు స్ఫూర్తి దాత ఆయన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఇలాంటి ప్రోత్సాహం పొందడం నాకు దక్కిన అరుదైన గౌరవం అంటూ మిథాలీరాజ్ చెప్పుకొచ్చింది . ఇక దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రధానీ తనపై పెట్టుకున్న అంచనాలను అందుకునేందుకు ఇంకా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నా అంటూ చెప్పుకొచ్చింది మిథాలీ రాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: