ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో మొదటి జరిగిన టెస్ట్ మినహాయించి టీ 20 సిరీస్ మరియు వన్ డే సిరీస్ లలో అదరగొడుతోంది. టీ 20 సిరీస్ లో ఇప్పటికే 2-1 తేడాతో టైటిల్ ను చేజిక్కించుకుంది. ఆ తరువాత మొదలైన వన్ డే సిరీస్ లోనూ... మొదటి వన్ డే లో ఇంగ్లాండ్ ను బుమ్రా తన స్వింగ్ మాయతో బెంబేలెత్తించాడు. దీనితో ఏకంగా పది వికెట్ల తేడాతో ఇండియా ఇంగ్లాండ్ పై ఘనవిజయాన్ని అందుకుంది. కాగా ఈ రోజు లార్డ్స్ వేదికగా రెండవ వన్ డే మొదలైంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ లో లాగా కాకపోయినా ఈ మ్యాచ్ లో కూడా ఇండియా బౌలర్లు దుమ్ములేపారు.

అయితే బుమ్రా ఈ మ్యాచ్ లో అంతగా ఎఫెక్టివ్ గా లేకపోయినా... మిగిలిన బౌలర్లు ఇంగ్లాండ్ ఆటగాళ్ల భారతం పట్టారు. ఓపెనర్లు మాత్రం ఏకాసేపు ప్రతిఘటించారు.  అయితే గత మ్యాచ్ లో బుమ్రా బాధ్యతను ఈ మ్యాచ్ లో చాహల్ తీసుకున్నాడు. అద్భుతంగా బంతిని తిప్పుతూ ఇంగ్లాండ్ ఆటగాళ్లను మాయ చేస్తూ తన వలలో వేసుకున్నాడు. ప్రమాదకరమైన బెయిర్ స్టో, రూట్ మరియు స్టోక్స్ వికెట్లను తీసుకుని కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇక ఇతనికి షమీ మరియు హార్దిక్ పాండ్య ల నుండి అద్బుతమయిన సహకారం అందింది. ఇద్దరూ చెరో వికెట్ తీసుకుని పర్వాలేదనిపించారు.

కాగా బుమ్రా మాత్రం ఇంకా వికెట్ల ఖాతా తెరవకపోవడం గమనార్హం. ప్రస్తుతం క్రీజులో డేంజరస్ ఆటగాళ్లు లివింగ్ స్టోన్ మరియు మొయిన్ అలీ ఉన్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడితే ఇంగ్లాండ్ గౌరవ ప్రదమైన స్కోర్ ను సాధిస్తుంది. కనీసం ఈ మ్యాచ్ లో అయినా ఇంగ్లాండ్ గట్టి పోటీ ఇస్తుందా చూడాలి. మరి ఏమి జరుగుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: