గత కొన్ని రోజుల నుంచి రోడ్ సేఫ్టీ వరల్డ్ టి20 సిరీస్ లో భాగంగా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఎన్నో ఏళ్ల నుంచి ఆటకు దూరంగా ఉన్న లెజెండరీ క్రికెటర్స్ అందరూ కూడా మరోసారి మైదానంలోకి దిగారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మాజీ క్రికెటర్ల ఆటను మరోసారి మైదానంలో చూసేందుకు అభిమానులందరికీ కూడా అవకాశం దక్కింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా మిస్ చేయకుండా చూస్తున్నారు ప్రేక్షకులు.. ఇకపోతే రోడ్ సేఫ్టీ వరల్డ్ టి20 సిరీస్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇకపోతే వరుస విజయాలతో దూసుకుపోయిన  ఇండియా లెజెండ్స్ జట్టు మరోసారి తమ అధిపత్యాన్ని కొనసాగించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల రోడ్ సేఫ్టీ వరల్డ్ టి20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్ జట్టు పై సెమి ఫైనల్లో 41 పరుగులు తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టిన టీమిండియా లెజెండ్స్ జట్టు.. ఇక ఫైనల్లో కూడా అదరగొట్టింది అని చెప్పాలి. ప్రత్యర్థి శ్రీలంక లెజెండ్స్ జట్టును ఓడించి చివరికి రోడ్ సేఫ్టీ సిరీస్ విజేతగా నిలిచింది ఇండియా లెజెండ్స్.


 ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక లెజెండ్స్ జట్టుపై 33 పరుగులు తేడాతో విజయ డంకా మోగించింది. అయితే భారత బ్యాట్స్మెన్ నమన్ ఓజా 108 పరుగులతో సెంచరీ తో చెలరేగిపోయి ఇండియా లెజెండ్స్  విజయంలో కీలక పాత్ర వహించాడు. ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్ లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది ఇండియా లెజెండ్స్ జట్టు. ఆ తర్వాత లక్ష్య చేదనకు  దిగిన శ్రీలంక లెజెండ్స్ జట్టు 162 పరుగులకే ఆల్ అవుట్ అయింది . దీంతో 33 పరుగుల తేడాతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ఇండియా లెజెండ్స్ జట్టు విజయ పతాకం ఎగరవేసింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: