గత కొంత కాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.. అటు ప్రపంచ క్రికెట్లో అన్ని దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరుగుతూ ఉండేవి.. అంతే కాకుండా ఒక జట్టు మరో దేశానికి పర్యటనకు వెళ్లడం కూడా జరుగుతూ ఉండేది. కానీ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం పై అన్ని దేశాలు కూడా నిషేధం విధించాయి అని చెప్పాలి. ఇక ఇంత పెద్ద నిర్ణయం తీసుకో వడానికి వెనుక ఒక పెద్ద కారణం కూడా ఉంది.


 2009లో ఏకం గా  పాక్ పర్యటనకు వెళ్ళిన ఆటగాళ్లపై ఉగ్రదాడి జరగడం కారణం  గా ఏకం గా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా పాకిస్తాన్ పర్యటన పై నిషేధం విధిస్తు నిర్ణయం తీసుకున్నాయి అని చెప్పాలి. ఇక అప్పటి నుంచి దశాబ్ద కాలం పాటు ఏ జట్టు పాకిస్తాన్లో అడుగు పెట్టలేదు. కానీ గత కొంత కాలం నుంచి ఇక పాకిస్తాన్ పర్యటనకు వెళ్లేందుకు విదేశీ జట్లు కూడా కాస్త ఆసక్తి చూపుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా భారత్ ఇదే నిషేధాన్ని కొనసాగిస్తూ ఉంది అని చెప్పాలి.


 అయితే ప్రస్తుతం విదేశీ జట్లు పాకిస్తాన్ లో పర్యటనకు వస్తూ ఉండటం పై ఇక ఆ జట్టు మాజీ ఆటగాడు షాహిద్ స్పందించాడు. 2009 ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో సిరీస్ లు ఆడేందుకు ఏ జట్టు ముందుకు రాకపోవడం తో దేశం లోని క్రికెట్ మైదానాలను వివాహ వేదికలుగా మార్చారు అంటూ గుర్తు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు గడ్డు కాలం ముగిసి పోయిందని విదేశీ టీంలు పాకిస్తాన్ పర్యటనకు వచ్చి క్రికెట్ ఆడుతున్నాయని ఇక తమ దేశం కూడా క్రీడలను ప్రేమించే దేశం అన్న విషయం ప్రపంచానికి అర్థమైంది అంటూ షాహిద్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: