ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన చటేశ్వర్ పూజార ఇక ఇటీవలే మళ్ళీ జట్టులోకి పునరాగమనం చేశాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టుల్లో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి అదరగొట్టాడు పూజార. అంతకుముందు 90 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. అయితే సెంచరీ చేయడం ద్వారా నాలుగేళ్ల భారాన్ని దింపుకున్నాడు. అంతే కాదు ఇక తన కెరియర్ లోనే ఎంతో దూకుడుగా సెంచరీ చేశాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే చటేశ్వర్ పూజార ఐపీఎల్లోకి కూడా వచ్చేస్తాడా అనే అనుమానాలు అందరిలో వచ్చాయి. కాగా డిసెంబర్ 23వ తేదీన వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం వేలం జరగబోతుంది. అయితే పూజార మాత్రం తన పేరును నమోదు చేసుకోలేదు. కాగా 2014 సీజన్లో మొదటిసారి అతనికి ఆడే అవకాశం లభించింది. ఇక అప్పటి నుంచి టి20 లీగ్ లో ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం రాలేదు. ఇదే విషయంపై స్పందించిన టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత టి20 లీగ్ ఆడటం గురించి పూజార ఆలోచించడం లేదు అంటూ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు.


 నిజానికి చటేశ్వర పూజార టి20 లీగ్ లో ఆడతాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అతను కొంతకాలం పాటు ఇక భారత టి20 లీగ్ లో భాగం కావాలని ఎంతగానో ప్రయత్నించాడు. కానీ ఆ తర్వాత తనకు టి20 ఫార్మట్ సరిపడదు అన్న విషయాన్ని తెలుసుకొని.. ఇక ఆ ఆశలు వదిలేసాడు. గత వేసవిలో ఒకవైపు ఐపీఎల్ జరుగుతుంటే.. అతను మాత్రం ఎక్కువగా ఇంగ్లాండులోనే గడిపాడు. అక్కడ అతడు తన నైపుణ్యాలకు పదును పెట్టుకున్నాడు. ఎక్కడైతే అతను ఆటను ఎంజాయ్ చేస్తాడో.. అలాగే అభిమానులు కూడా ఆనందిస్తారు. అందుకోసమే అతను ఆడుతున్నాడు. ఇవన్నీ చటేశ్వర్ పూజరాకు బాగా తెలుసు. ఐపీఎల్ అతనికి సరైంది కాదు అంటూ దినేష్ కార్తీక్ వెల్లడించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: