టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావుకి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన సినిమా పరంగా.. రాజకీయ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నందమూరి తారక రామారావు వేషం కట్టారు అంటే అది ఎలాంటి నాటకం అయినా సరే లేదా సినిమా ఏదైనా విజయం సాదించాల్సిందే. అంతేకాదు.. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, డాన్స్ స్టెప్పులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పిన తక్కవగానే అనిపిస్తుంటుంది.

అయితే ఎన్టీఆర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా , స్క్రీన్ ప్లే రైటర్ గా, నృత్యకారుడిగా ఇలా ఎన్నో రంగాలలో ప్రావీణ్యం సంపాదించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాక..  స్క్రీన్ ప్లే రైటర్ గా ఆయన ఎవరి దగ్గరా శిక్షణ పొందకుండానే తన సొంత ప్రతిభతో స్క్రీన్ ప్లే రైటర్ గామరెన్నో సినిమాలకు పని చేశాడు. ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి సీఎంగా రాణిస్తున్న సమయంలో ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల ద్వారా నేటికీ ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు అంటే ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా ఎంత గొప్పగా ఆదరణ పొందుతోందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక ఇదిలా వుండగా..నందమూరి తారక రామారావును దత్తత తీసుకున్నారు అనే ఒక విషయం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే తండ్రి నందమూరి లక్ష్మయ్య చౌదరి , తల్లి నందమూరి వెంకటరామమ్మకు నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నిమ్మకూరు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టారు. కాగా.. నందమూరి తారక రామారావు మామయ్య, అత్తయ్య లకు పిల్లలు లేకపోవడం కారణంగా..లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులు.. వెంకట రామమ్మ అన్న వదినలకు చిన్నతనంలోనే నందమూరి తారకరామారావుకు దత్తత ఇచ్చారని సమాచారం. ఎన్టీఆర్ వారి సంరక్షణలోనే పెరిగారని సమాచారం. ఇక అప్పటికీ..ఇప్పటికీ..ఎన్నటికీ దేశం గర్వించదగ్గ వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: