గ్రహణం ప్రారంభం అయ్యే సమయానికి అరగంట ముందు స్నానం చేసి మీరు ఎప్పుడూ చదివే స్తోత్రం గానీ, దేవుడి శ్లోకాలు గానీ అనుసంధించాలి. ఇంకా మీరు నిత్యం జపించే మంత్రం జపిస్తే మంచిది. గ్రహణం విడుపు సమయానికి జపం ముగించాలి. 

 

గ్రహణకాలంలో జపం పదిరెట్ల ఫలితాన్నిస్తుందని శాస్త్రం చెబుతున్నది. ఈ సమయంలో ఇచ్చే దానాలు కూడా రెట్టింపు ఫలితాలనిస్తాయి.

 

వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్న వారు గ్రహణ కాలానికి రెండు గంటల ముందే ఏదైనా ఆహారం తీసుకోవచ్చు. 

 

గ్రహణం వీడిన తర్వాత మరల స్నానం, జపం చేసి ఆహారం తీసుకోవాలి. రాహు కేతువుల పట్టులో సూర్యచంద్రులున్నప్పుడు ఆ గ్రహాల కిరణాలు మనుషుల మీదా పదార్థాల మీద పడకూడదు. అందువల్ల ఇంట్లో నిలవ ఉండే ఆవకాయ పచ్చళ్ళ మీద దర్భలు వేసి ఉంచాలి. 

 

గ్రహణ సమయంలో భక్తులు ఇంట్లోనే స్నాన, జప తపాలు చేసుకుంటూ ఆలయాలకు వెళ్ళకూడదు. ఈ అపవిత్ర సమయంలో దేవాలయాలను మూసి ఉంచడం సంప్రదాయంగా వస్తున్నదే.

మరింత సమాచారం తెలుసుకోండి: