వరుస సిరీస్ లను గెలుచుకుంటూ  దూసుకుపోతున్న టీమిండియాకు న్యూజిలాండ్ పర్యటనలో బ్రేక్ పడింది అనే చెప్పాలి. ప్రత్యర్థి జట్టు ఎవరైనా చిత్తుగా ఓడిస్తు  తమదైన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ వరుస సిరీస్ లను  గెలుచుకుంటుంది కోహ్లీ సేన. ఇప్పటికే ఓటమి లేని జట్టుగా దూసుకుపోతుంది. కానీ విజయోత్సాహంతో  దూసుకుపోతున్న కోహ్లీసేనకు  న్యూజిలాండ్ బ్రేక్ వేసి భారీ షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మొదట  టి20 సిరీస్ ఆడిన టీమిండియా... న్యూజిలాండ్ దేశంలోనే ఆదిత్య జట్టును చిత్తుగా ఓడించి క్లీన్స్వీప్ చేసింది. ఐదు మ్యాచ్లలో విజయం సాధించి న్యూజిలాండ్ జట్టును న్యూజిలాండ్ లోనే చిత్తుగా ఓడించింది. 

 

 దీంతో కోహ్లీసేన కు మరోసారి తిరుగులేదు అని నిరూపించింది. ఇక ఆటగాళ్లందరూ అద్భుతమైన ఫామ్లో ఉండటం టీమిండియాకు ఎంతగానో కలిసొచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన వన్డే మ్యాచ్లో మాత్రం టీమిండియా ఎవరూ ఊహించని విధంగా పేలవ  ప్రదర్శనతో సిరీస్ ను చేజార్చుకుంది. న్యూజిలాండ్ ఓడించడం పెద్ద గొప్ప కాదు అనుకున్నారో  లేక కారణం ఏదైనా కావచ్చు కానీ వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు మాత్రం బ్రేక్  పడిందనే చెప్పాలి. ముఖ్యంగా రెండు మ్యాచ్లలో ఓటమిపాలై న్యూజిలాండ్కు సిరీస్ ను కట్టబెట్టింది. కాగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా బౌలర్లు బ్యాట్స్మెన్లు సహా ఫీల్డింగ్ లో కూడా వైఫల్యం చెందింది టీమిండియా. 

 


 టీమిండియాలో స్టార్ బ్యాట్ మెన్ లు  సైతం న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ఓపెనింగ్లో పంపినప్పటికీ పృథ్వీషా మయాంక్ అగర్వాల్ రెండు వన్డేల్లో నిరాశ  పరిచారు. ఆ తర్వాత కెరీర్ లోనే సూపర్ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ కూడా వన్డే మ్యాచ్ లో నిరాశపరిచాడు అనే చెప్పాలి. ఇక పరుగుల యంత్రం కోహ్లీ కూడా 15 పరుగుల తోనే  వెనుతిరిగాడు. దీంతో కోహ్లీసేన క్లిష్టపరిస్థితుల్లో పడింది. ఇక ఆ తర్వాత వచ్చిన బౌలర్లు తమ అద్భుతమైన బ్యాటింగ్తో విజయతీరాలకు మ్యాచ్ని నడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఒకానొక సమయంలో న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి వారు కూడా వికెట్ సమర్పించుకోవాల్సి  వచ్చింది. దీంతో 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ రెండు వన్డే మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ విఫలం కావడమే ఓటమికి కారణం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: