ఇటీవలి కాలంలో టీమిండియా యువ ఆటగాళ్లు అందరూ కూడా కూడా వరుసగా పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాళ్ళు అవుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో టీమిండియా స్టార్ ఆటగాడు పెళ్లి పీటలేక్కేందుకు సిద్ధమవుతున్నాడు.  ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఆటగాడిగా కొనసాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు టీమిండియా పేసర్ జస్ప్రిత్ బూమ్రా. తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ.. ఎంతో మంది అభిమానులను  కూడా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా విజయంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర వహిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 కేవలం బౌలింగ్తో మాత్రమే కాదు తనదైన బౌలింగ్ యాక్షన్ తో కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు జస్ప్రిత్ బూమ్రా. అయితే జస్ప్రిత్ బూమ్రా మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లపై సంధించే  యార్కర్ లకు ప్రత్యర్థి బ్యాట్స్మెన్  దగ్గర అసలు సమాధానమే ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.  టీమిండియాలో ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రా మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు  వార్తలు  ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో  జరగబోయే వన్డే టి20 సిరీస్ కోసం బుమ్రా  ఆడటం లేదు అన్న విషయం తెలిసిందే. మొదట బిసిసిఐ బుమ్రా కు  రెస్ట్ ఇచ్చింది అని అనుకున్నారు అందరు.



 కానీ పెళ్లి ఏర్పాట్ల కోసమే జస్ప్రిత్ బూమ్రా సెలవులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బూమ్రా ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు పెళ్లి తేది ఎప్పుడు అన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే గతంలో జస్ ప్రీత్ బుమ్రా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో డేటింగ్ లో ఉన్నాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బూమ్రా అనుపమ పరమేశ్వరన్ ను పెళ్లి చేసుకుంటాడా  లేదా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాడా  అన్న చర్చ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: