ప్రస్తుతం టీమిండియాను ఎంతో సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్న ఆటగాళ్లు ఎవరు అంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అని గుక్క తిప్పుకోకుండా చెబుతారు ప్రేక్షకులు. టీమిండియా క్రికెట్లో సీనియర్ ఆటగాళ్లు గా ఉన్న ఇద్దరు కూడా ఇక ప్రస్తుతం తమ ఆటతీరుతో టీమిండియాకు ఎనలేని గౌరవాన్ని తెచ్చి పెట్టారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం పరుగుల యంత్రం గా కొనసాగుతూ ఉంటే రోహిత్ శర్మ ప్రేక్షకులకు హిట్ మ్యాన్ గా కొనసాగుతున్నాడు. ఇక మొన్నటి వరకు రోహిత్ శర్మ టీమిండియా మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపడితే ఇక ఇటీవల విరాట్ కోహ్లీ దగ్గరనుంచి సారధ్య సారథ్య  బాధ్యతలను తీసుకున్నాడు రోహిత్ శర్మ.


 ఇలా భారత జట్టుకు ఇద్దరు ఆటగాళ్ళు వెన్నెముక లాంటివారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఐపీఎల్ సీజన్ లో మాత్రం పేలవమైన ఫాం తో నిరాశపరిచారు అన్న విషయం తెలిసిందే. కెప్టెన్ గా సక్సెస్ అవుతున్న రోహిత్ శర్మ ఒక ఆటగాడిగా మాత్రం సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. కెప్టెన్సీ వదిలేసిన విరాట్ కోహ్లీ స్వేచ్ఛగా చెలరేగు తాడు అనుకుంటే పేలవమైన ఫాంతో నిరాశ పరుస్తున్నాడు.  ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ తీరుతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫాంపై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఫాంపై తమకు ఎలాంటి ఆందోళన లేదు అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ విరాట్ లూ ఎంతో క్వాలిటీ ఉన్న ప్లేయర్లు. ప్రపంచకప్ కు ఇంకా చాలా సమయం ఉంది. ఈ క్రమంలోనే ప్రపంచ కప్ టోర్నీ సమయానికి ఇద్దరు క్రికెటర్లు కూడా మళ్ళీ తిరిగి ఫాంలోకి వస్తారనే నమ్మకం ఉంది అంటూ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇక ఈ వ్యాఖ్యలతో విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయిన కారణంగా పక్కకు పెట్టేశారు అనే వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: