వాట్సాప్ లో తాజాగా మరొకసారి కొత్త ఫీచర్ విడుదలైంది. రియాక్షన్ ఫీచర్ ను అధికారికంగా రిలీజ్ చేసింది వాట్సాప్. ప్రస్తుతం ఉన్న టెలిగ్రామ్, వంటి వాటి ఇమేజెస్ లాంటి ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం కోసం వాట్సాప్ కి సరికొత్త ఫీచర్ ను యూజర్ల కోసం అందిస్తోంది. ఈ వాట్సాప్ రియాక్షన్ ఫీచర్ ను ఈరోజు నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. వాట్సాప్ నుంచి వచ్చిన అతి పెద్ద ప్రకటన ఇది అని తెలిపారు.

ఈ ఫీచర్ కోసం ఎంతో కాలంగా మా సంస్థ పరీక్షిస్తుంది బీటా టెస్టర్ పరీక్షించిన తరువాత ఇతర యూజర్లకు ఇది అందుబాటులోకి వస్తోంది అని తెలిపారు. వాట్సాప్ లో మొదట ఎమోజి తో రియాక్షన్ ఫీచర్ ను టెస్ట్ చేశారు. ఇది ఆరు రకాలుగా అందుబాటులో ఉన్నది... లవ్, లైక్, సర్ ప్రైజ్, థాంక్స్, సాడ్, లాఫ్ వంటి ఎమోజీ లు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వాట్సాప్ లో మనకు ఏదైనా మెసేజ్ కి మీ రియాక్షన్ వీటి ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఈ సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చామని తెలియజేశారు.

ఇప్పటికే ఈ ఫీచర్ ఇతర యాప్స్ లో ఉన్నది. కేవలం వాట్సాప్ యూజర్ల కోసం  ఈ ఫీచర్ విడుదల చేయడం విశేషం. మీ వాట్సాప్ అప్డేట్ చేసిన తర్వాత ఈ ఫీచర్ ని ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. మనం ఏదైనా మెసేజ్ ని లాంగ్ ప్రెస్ చేసినట్లు అయితే ఈ రియాక్షన్స్ కనిపిస్తాయని.. అందులో మీరు ఏదో ఒక రియాక్షన్ ని సెలెక్ట్ చేసుకొని పంపించవచ్చు అని తెలిపారు. వాస్తవానికి ఈ రియాక్షన్ ఫీచర్ను 2018 వ సంవత్సరం నుంచి పరీక్షిస్తున్నట్లుగా సీఈవో తెలిపారు. గడచిన సంవత్సరం ఫైనల్ టెస్టింగ్ కు పంపించాము గత నెలలో ఈ వాట్సాప్ గ్రూప్ ని కలుపుతూ రూపొందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. అందుకోసమే ఈ సరికొత్త ఫీచర్ను విడుదల చేశామని తెలిపారు. గ్రూప్స్ ఆడియో కాల్ లిమిట్స్ 32 మందికి చేసుకునే విధంగా పెంచారు. ఇక షేరింగ్ ఫైల్స్ లిమిట్ 2 GB వరకు పెంచి బోతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: