
ఎంతలా అంటే ప్రస్తుతం కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుంటూ మార్కెట్లో డబ్బులు సంపాదించుకుంటున్నారట. ఖమ్మం సుజాతగా జబర్దస్త్ లో లేడీ గెటప్ తో ఆదరించిన శేఖర్.. ఎన్నో ఆశలతో జబర్దస్త్ లోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా హైపర్ ఆది సహాయంతో ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అతను వెంకీ మంకీ టీంలో చాలా ఏళ్లు కొనసాగారు. క్రమక్రమంగా అవకాశాలు తగ్గుతూ ఉండడంతో కుటుంబ పోషణ కూడా భారం కావడంతో చివరికి కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనాన్ని సాగేస్తున్నారట. తను చదివింది కేవలం 9వ తరగతి అని తన తల్లితండ్రులు చదివియ్యకపోవడంతో కూలి పనులకు వెళ్లాను అంటూ తెలిపారు.
తాను మంచి డాన్సర్ని అయితే అదృష్టం కొద్దీ జబర్దస్త్ లో తనకి అవకాశాలు వచ్చినా కూడా తన టాలెంట్ తో చాలామందిని నవ్వించిన అదృష్టం తనకి ఎంతో కాలం నిలువలేకపోయిందని తన భార్యకు థైరాయిడ్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వంటి హెల్త్ సమస్యలు కూడా ఉన్నాయని తెలియజేశారు శేఖర్.. అలా తరచూ ఎక్కువగా హాస్పటల్ కి వెళుతూ ఉంటామని అలాగే పిల్లల ఫీజు ఇంట్లో ఖర్చులు ఇలా అన్నీ కూడా చాలానే ఉన్నాయని.. తన భార్య పిల్లలను వదిలిపెట్టలేక జబర్దస్త్ కు దూరమయ్యారని దీంతో తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.. ఒకవేళ జబర్దస్త్ లో మళ్లీ అవకాశాలు వస్తే ఆలోచిస్తానని.ప్రస్తుతం తన కుటుంబం మొత్తం తన మీదే ఆధారపడిందని ఎమోషనల్ గా తెలిపారు శేఖర్