ప్రపంచంలో కరోనా ఉదృతి ఎక్కువ అవ్వడంతో,  రోజు రోజుకు కొన్ని లక్షల మంది ఈ కరోనా బారిన పడుతున్నారు .అయితే ఈ కరోనా బారిన పడిన వారికి చాలామందికి ఆక్సిజన్ ఎక్కువగా అవసరమవుతుంది . ముఖ్యంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత చాలా వరకు కనబడుతోంది . ఇక దీంతో చేసేదేమీ లేక ఎవరైతే కరోనా తో ఎక్కువ సీరియస్ గా బాధపడుతున్నారో , అలాంటి వాళ్లకు మాత్రమే ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది . కొన్ని ఆస్పత్రుల్లో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది గా ఉన్నా  నెగటివ్ వస్తే మాత్రం , వాళ్లకు ట్రీట్మెంట్ లో ఆక్సిజన్ ఇవ్వడం లేదు.. దీంతో వారికి చాలా ఇబ్బందికరంగా మారింది..

అయితే ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడాలి అంటే, ఇప్పుడు ఇంట్లోనే ఆసుపత్రులకు వెళ్ళకుండానే ఆక్సిజన్ మెషన్ లను ఏర్పాటు చేసుకోవచ్చు.. అయితే దీనికోసం మీరు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు .రూమ్ లోని గాలిని తీసుకుని, ప్యూరిఫై చేసి ఆక్సిజన్ ను అందించే ఈ మిషన్ లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది.. ఆక్సిజన్ సిలిండర్ ల కంటే ఆక్సిజన్ మెషిన్ల కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కరోన పేషెంట్లు..

ఇక అర్ధరాత్రి సమయాల్లో కూడా తమకు క్లైంట్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి డీలర్లు చెబుతున్నారు. చూడడానికి వాటర్ ప్యూరిఫైయర్ లాగా కనిపించినా, రూమ్ లోని గాలిని ప్యూరిఫై చేసి , స్వచ్ఛమైన ఆక్సిజన్ ను మనకు అందిస్తాయి. అందుకే వీటిని ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అని అంటారు. వీటి ధర  సుమారు 80 వేల రూపాయల వరకు ఉంటుంది. డిమాండ్ని బట్టి రెంట్ సౌకర్యం కూడా ఉందని డీలర్లు చెబుతున్నారు.. ఇక ముఖ్యంగా వీటిని హైదరాబాద్ డీలర్లు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు.

ఇక ఈ మెషిన్ పనితీరు విషయానికొస్తే, దీని చుట్టూ ఉన్న గాలిని తీసుకొని ప్యూరిఫై చేస్తుంది .గాలిలో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది . ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది . దాన్ని పిక్  చేసుకొని సేవ్ చేసి మనకు అవసరమైనప్పుడు ఆక్సిజన్ ను అందిస్తుంది. ఇక ఎవరైతే ఈ మెషీన్ ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో ,  కస్టమర్ లు ఆర్డర్ ఇచ్చిన తర్వాత సప్లయర్ లు వారి టీం తో పాటు వెళ్లి ఇంట్లో సెట్ చేసి ,ఎలా యూస్ చేసుకోవాలి కూడా వివరిస్తున్నారు అయితే ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో డాక్టర్ల సలహా మేరకు ముందుకు వెళ్ళడం మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: