కళ్ళు తాగిన కోతి పేరు మనం వినే ఉంటాము.. కోతి బుద్ది అసలే వంకర బుద్ది..అది ఏం చేస్తుందొ దానికే తెలియదు..అలాంటి కోతి కాస్త చుక్కెసుకుంటే ఇక తర్వాత సంగతి మీరే ఊహించుకొండి.. అయితే ఈ మధ్య కోళ్లు కూడా ఎక్కువగా మద్యం తాగాయని వార్తలు వినిపిస్తున్నాయి...గతంలో ఓ కోతి మందు తప్ప మంచినీళ్ళు ముట్టదు..ఇక ఇప్పుడు మరో రెండు కోళ్లు పట్ట పగలే ఫుల్లు బుడ్డి తాగుతూ గాల్లో చక్కర్లు కోడుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఆ వీడియో ఇప్పుడు మీరే చూడండి..


మనుషులు మందేసి బాధను మరిచిపోవచ్చని, తగైతే ఉల్లాసం , ఉత్సహం అని కూడా చెప్తుంటారు మద్యం ప్రియులు. తాజాగా ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరాల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకు అంతలా షాక్ అయ్యే విషయం ఏంటంటే. ఇప్పటికే మనం జంతువులు మద్యం తాగడం చూశాం. కోతులు మందుకొట్టడం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ కోడి మందుకొట్టింది.


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ విచిత్రమైనా ఆసక్తికర ఘటన వైరల్‌గా మారింది.ఈ వైరల్ వీడియోలో ఒక కోడి మరో కోడితో పగటిపూట కలిసి బీర్ తాగింది. ఒక బీర్ బాటిల్ అలాగే బీర్ నిండా గ్లాస్ నెల పై ఉంచగా.. అక్కడికి వచ్చిన ఓ కోడి ముందుగా మెడను వంచి గ్లాసులోంచి బీరు తాగుతుంది. ఇది చూసి మరో కోడి కూడా పార్టీలో జాయిన్ అయ్యింది. అదికూడా వెంటనే ఆ గ్లాస్ లోని బీరును తాగింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని మీమ్ పేజీ షేర్ చేసింది. ఇది ఇప్పటివరకు 34k వ్యూస్, 1,400 లైక్‌లను పొందింది. ఇది మీమ్స్‌తో ఎడిట్ చేసిన వీడియో.. వీడియో చూసిన నెటిజన్లు ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ ఇచ్చారు.. కామెంట్స్ తో నిండి పోయాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: