
జీడిపప్పు కిలో 20 - 30 కి దొరికేది ఝార్ఖండ్ లోని జంతర్ జిల్లాలోని "నాలా" అనే గ్రామం. దీనిని ఝార్ఖండ్ జీడిపప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు. చుట్టుపక్కల జిల్లాలో మరియు దగ్గరగా ఉండే రాష్ట్రాల నుండి కొంత మంది ప్రజలు నాణ్యమైన జీడిపప్పులను కొనుగోలు చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు . అంతేకాదు ఇక్కడ దొరికే దానికి 100 రెట్లు రేటు అధికంగా రేట్లు పెట్టి సూపర్ మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారు కొందరు జనాలు. మంచి లాభంతో కూడిన బిజినెస్ . అయితే ఎందుకు ఇక్కడ ఇంత తక్కువగా జీడిపప్పు దొరుకుతుంది.>?? అంటే మాత్రం ఈ గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడిపప్పు తోటలో నాటబడ్డాయి .
ఈ తోటలో పనిచేసే మహిళలు మరియు పిల్లల జీడిపప్పులను చాలా తక్కువ ధరకే అమ్ముతూ ఉంటారు. అక్కడ నేల జీడిపప్పు సాగుకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే జార్ఖండ్ జీడి పప్పు చాలా చాలా తక్కువ ధర. క్వాలిటీ మాత్రం నెంబర్ 1. ప్రభుత్వం రైతులను ప్రోత్సహించి అక్కడ జీడిపప్పు సాగుపై దృష్టి పెట్టడం ప్రారంభించారు. అంతకుముందు వరకు జంతర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కృపనంద దీనికోసం చాలా కష్టపడ్డారు .ఇంత జీడిపప్పు పండిస్తున్నప్పటికీ అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ లేదు. అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి అంటూ జనాలు రిక్వెస్ట్ చేస్తున్నారు. అప్పుడు రేటు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది..!!