చూడగానే  నోటిలో లాలాజలం వచ్చే ఒకే ఒక సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ బ్రెడ్ హల్వా. ఇది ఇష్టపడని వారు ఎవరు ఉండరు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాక దీన్ని చూస్తే తినే దాక వదలరు. 

        

         ఇపుడు అందరికి ఇష్టం అయినా బ్రెడ్ హల్వాకి కావలిసిన పదార్ధాలు ఏంటో చూద్దామా

       కావాల్సిన పదార్దాలు :

          1)బ్రెడ్ స్లైసెస్ - 5

          2)పంచదార -1/3కప్ 

          3)పాలు -1 కప్ 

          4)నెయ్యి -1/4 కప్ 

          5)జీడిపప్పు మరియి కిస్మిస్ -50gms

        బ్రెడ్ హల్వాకి కావలిసిన పదార్దాలు ఏంటో చూసాము కదా. ఇపుడు ఎలా తయారుచేద్దామో చూద్దామా. 

         
 
       తయారీ విధానం :
         ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టి వేడిచేయాలి. పెనం వేడెక్కే లోపు బ్రేడ్ స్లైసెస్ ఎడ్జెస్ కట్ చేసుకుని పెట్టుకోవాలి... పెనం వేడి ఎక్కాక ఒక్కొక స్లైస్ని నెయ్యి వేసి రెండువైపులా గోల్డిష్ కలర్ వచ్చేలా చూసుకోవాలి. స్లైసెస్ అన్ని పైన చేప్పిన విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి..


    ఒక బాండి తీసుకుని అందులో నెయ్యి వేసి జీడిపప్పు అండ్ కిస్ మిస్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.. ఆ బాండి లో వాటర్ పోసి, తర్వాత షుగర్ యాడ్ చెయ్యాలి.. షుగర్ అంతా కరిగాక ఒక 5 నిముషాలు ఉంచి, పంచదార పాకంలో బ్రేడ్ స్లైసెస్ వేయాలి.. బ్రేడ్ స్లైసెస్ ని గరిటెతో తిప్పి మాష్ చెయ్యాలి, తర్వాత పాలు యాడ్ చెయ్యాలి. గరిటె తో తిప్పుతూ కొంచెం కొంచెం నెయ్యి కలుపుతూ ఉండాలి.. పాకం దగ్గరకి వచ్చాక జీడిపప్పు మరియి కిస్మిస్ కలిపి గార్నిష్ చేయాలి.
అంతే సింపుల్!!!

 

            టేస్టీ టేస్టీ బ్రేడ్ హల్వా రెడీ... చెప్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా !!ఇంకా ఎందుకు ఆలస్యం తయారు చేసి, రుచి చూసి చెప్పండి... ఇంకో విషయం ఫ్రెండ్స్ నెయ్యి విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి... అపుడే మీకు అనుకున్న రుచి వస్తుంది... మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: