సాధారణంగా ప్రతి మహిళ జీవితంలోనూ గర్భధారణ సమయం అనేది ఎంతో అపురూపమైన ఘట్టం. ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో మధురమైన అనుభూతులు, మరెన్నో అనుభవాలను పొందుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇక కడుపులోని శిశువు ఆరోగ్యంగా ఎదిగేందుకు బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

అయితే గర్భిణుల ఆహార డైట్‌లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇక  గర్భిణీ స్త్రీలు తెలిసో, తెలియకో కొన్ని కొన్ని ఆహారాలను పక్కన పెడుతుంటారు. అంతేకాదు అటు వంటి వాటిల్లో సగ్గుబియ్యం కూడా ఒకటి. చాలా మంది స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో సగ్గు బియ్యాన్ని తినేందుకే పెద్దగా ఆసక్తి చూపారు. అందరికి తెలియని విషయం ఏంటంటే.. సగ్గు బియ్యం గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు.

ఇక సగ్గు బియ్యంలో ఐరన్‌, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్‌, కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్‌, ఫైబర్ ఇలా చాలా పోషకాలు ఉంటాయి. అందువలన సగ్గు బియ్యం హెల్త్‌కి ఎన్నెన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అంతేకాదు.. కడుపులోని బిడ్డ ఎదుగుదల అద్భుతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శిశువు అవలక్షణాలతో పుట్టే ప్రమాదం తగ్గు ముఖం పడుతుందని చెబుతున్నారు. అంతే ముఖ్యంగా పుట్టబోయే బిడ్డలో రక్త హీనత సమస్య ఏర్పడకుండా చూస్తుందని తెలిపారు.

అయితే సగ్గు బియ్యం తీసుకుంటే గర్భిణీలకు అవసరమయ్యే అతి ముఖ్యమైన పోషకాలు ఐరన్‌, విటమిన్ బి కూడా లభిస్తాయని పేర్కొన్నారు. ఇక సగ్గు బియ్యాన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే.. ప్రసవ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులూ తగ్గుతాయని వెల్లడించారు. ఇవి గర్భిణీలకే కాదు.. ఎవ్వరికైనా సగ్గు బియ్యం మంచే చేస్తాయని వెల్లడించారు. అన్నింటికంటే ముఖ్యంగా మధుమేహాన్ని అదుపు చేయడంలోనూ, జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరచడంలోనూ, ఎముకలను దృఢంగా మార్చడంలోనూ సగ్గు బియ్యం సూపర్‌గా హెల్ప్ చేస్తాయని అన్నారు. అందుకే గర్భిణీలే కాకుండా అందరూ సగ్గు బియ్యాన్ని తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: