డైట్ ను ప్లాన్ చేస్తున్నప్పుడు మనం సాధారణంగా ఆరోగ్యంపై ఫోకస్ చేయడం జరుగుతుంది. కానీ, మనం ఏది తింటే అది మన చర్మంపై కూడా ప్రభావము చూపిస్తుందని మనం గమనించాలి. ట్రాపికల్ ట్రీట్మెంట్స్ అంటే ఆయింట్ మెంట్స్ రూపంలో లేదా లోషన్స్ రూపంలో స్కిన్ గురించి కేర్ తీసుకోవడం కంటే డైట్ ద్వారానే లోపలి నుంచి స్కిన్ గురించి కేర్ తీసుకోవడమనేది మంచి ఐడియా. మనం ఎటువంటి ఆహారాలను తీసుకుంటే స్కిన్ హెల్త్ బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ ఏ సమృద్ధిగా లభించే ఆహారాలను తీసుకోవలసి ఉంటుంది.

విటమిన్ ఏ లో ఉండే రెటినాల్ నూతన చర్మ కణాల ఉత్పత్తితో పాటు వృద్ధిని ప్రమోట్ చేస్తుంది. విటమిన్ ఏ లో బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ పై పోరాడతాయి. దాంతో ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్స్ అనేవి కనిపించవు. అంతేకాదు, విటమిన్ ఏ అనేది హానికర సూర్యకిరణాల నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది కూడా.

1. టమాటోస్: బ్రైట్ రెడ్ టొమాటోస్ లో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి, టమాటోస్ ను కర్రీలలో గానీ లేదా సూప్స్ అలాగే చట్నీ రూపంలో తీసుకుంటే విటమిన్ ఏ అనేది మన శరీరానికి బాగా అందుతుంది.

2. క్యారెట్స్: కారెట్స్ లో అనేక పోషకవిలువలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్న బీటా కెరోటిన్ ను శరీరం సులభంగా విటమిన్ ఏగా కన్వర్ట్ చేసుకోగలదు.


3. ఆకుకూరలు: ఆకుకూరల్లో అంటే పాలక్ అలాగే మెంతి వంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. రెగ్యులర్ డైట్ లో వీటిని కూడా యాడ్ చేసుకోవాలి.

4. రెడ్ షిమ్లా మిర్చి: ఇది పిజ్జా, పాస్తా, సలాడ్ అలాగే మిగతా ఇంటరెస్టింగ్ డిషెస్ లో బాగా కలిసిపోతుంది. వాటికి టేస్ట్ ను అందిస్తుంది. విటమిన్ ఏ అలాగే సి ఇందులో పుష్కలంగా లభిస్తాయని గుర్తుంచుకోవాలి.

5. పచ్చసొన: గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ డి తో పాటు విటమిన్ ఏ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది మన స్కిన్ కు ఎంతో మంచిది. ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతమవుతుంది.

వీటితో పాటు బ్రొకోలీ అలాగే గుమ్మడికాయలో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి, స్కిన్ కేర్ కు ఆహారం కూడా ఎంతో హెల్ప్ చేస్తుందని గమనించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: