పొగాకు ఉత్పత్తుల నుంచి వచ్చే పొగ చిక్కటి ధూమ రేణువులను ఉత్పత్తి చేస్తుంది. ఇది వాయు కాలుష్య కారకాలలో ఒకటి. ధూమపానం రక్తనాళాలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. ధూమపానానికి బానిస అయితే.. ఆ అలవాటును మానుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.మాయిశ్చరైజర్ కు బదులు ఫేషియల్ ఆయిల్ వాడడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇది కాలుష్య కారకాలు చర్మంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ముఖాన్ని కడుక్కున్న తర్వాత మంచి ఫేషియల్ ఆయిల్‌ను అప్లై చేయడం చాలా ముఖ్యం.వాహనాల, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్లేటప్పుడు ఫుల్ స్లీవ్‌లు ధరించాలి. ముఖాన్ని మాస్క్‌లతో కప్పుకోవాలి.చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి, చర్మం దాని సహజవంతమైన కాంతిని కోల్పోకుండా ఉండటానికి ఫేస్ ప్యాక్, మాస్క్ చక్కగా ఉపయోగపడుతుంది. బొప్పాయి, కాఫీ, అరటిపండు పాలను ఉపయోగించి ఇంట్లోనే మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు. ఇవి చర్మాన్ని వాయు కాలుష్యం నుంచి రక్షించడమే కాకుండా కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి.


వాయు కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షించడానికి దానిని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. ప్రతి రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. నీరు తాగడం ద్వారా శరీరంలోని చర్మ కణాలు సజావుగా పని చేస్తాయి. చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. తగినంత నీరు తాగడం చర్మానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికీ మంచి ప్రయోజనం కలిగిస్తుంది.పొల్యూషన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో మనం చూస్తూనే ఉన్నాం. అక్కడి గాలిలో నాణ్యత ప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇస్తోంది. ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాలను వాయు కాలుష్యం కలవరపెడుతోంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి దెబ్బ తీస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వాయు కాలుష్యం కారణంగా.. చర్మం తేమను కోల్పోతుంది. దీంతో అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖంపై నల్ల మచ్చలు, ఫైన్ లైన్లు, ముడతలు వంటి సమస్యలూ వస్తాయి. కాబట్టి వాయు కాలుష్యం నుంచి రక్షించుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: